Home తాజా వార్తలు మెడిసిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

మెడిసిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

by Telangana Express

చేగుంట మార్చి 7 తెలంగాణ ఎక్స్ ప్రెస్

చేగుంట మండలంలోని పోతాన్పల్లి గ్రామంలో గురువారం రోజున గ్రామం పోతాన్ పల్లి , మండలం మసాయి పేట , జిల్లా మెదక్ , నందు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడము జరిగినది. ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్ పరీక్షలు మరియు కంటి పరీక్షలతో పాటు,చెవి,ముక్కు,గొంతు,వరిబీజము, బీజకుట్టు,గడ్డలు,కనతులు, థైరాయిడ్ గడ్డలు,గర్భ సంచికి సంబంధించిన సమస్యలు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, చర్మ సమస్యలు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలు చూసి మందులు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది.ఇట్టి కార్యక్రమములో ,పంచాయతీ సెక్రటరీ మౌనిక , గ్రామ ప్రజలు పాల్గొనడము జరిగింది. ఈ వైద్య శిబిరంలో 122 మందికి షుగర్, బీపీ, టెస్టులు చేయడం జరిగినది,ఆపరేషన్ అవసరము ఉన్న వాళ్ళ 52 మందిని రిపర్ రాయడం జరిగింది.వీరిని మెడిసిటీ హాస్పిటల్ కు తరలించి ఉచిత ఆపరేషన్లు చేయడం జరుగుతుంది.
ఈ వైద్య శిభిర కార్యక్రమంలో డాక్టర్లు వినయ్ ,సుచిత్ర ,కావ్య , కృష్ణ మార్కెటింగ్ ఇంచార్జి కుమారస్వామి, నాగార్జున,సత్యనారాయణ, సౌమ్య లు పాల్గొనడం జరిగింది.

You may also like

Leave a Comment