Home తాజా వార్తలు కుమ్మరోళ్లకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కి మనవి

కుమ్మరోళ్లకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కి మనవి

by Telangana Express

తెలంగాణ రాష్ట్ర కుమ్మరుల గౌరవ అధ్యక్షుడు కోడూరు చంద్రయ్య

మంచిర్యాల, మార్చి 06, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): కుమ్మరోళ్లకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర కుమ్మరుల సంఘం గౌరవ అధ్యక్షులు కోడూరి చంద్రయ్య మనవి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2004 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించినప్పుడు విజయవాడకు చెందిన ఐలాపురం వెంకయ్య ఆరు సంవత్సరాల కాల పరిమితి గల ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి కుమ్మర కులాన్ని గౌరవించారు.2004లో జరిగిన ఎన్నికల సమయంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి ఐలాపురం వెంకయ్య కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చినారు ఐలాపురం వెంకయ్య మీద కోట శ్రీనివాసరావు సినీ యాక్టర్ పోటీ చేసి నందున కోట శ్రీనివాసరావు పైన సినీ అభిమానంతో జనం గెలిపించారు. అయినా ఓడిపోయినప్పటికీ గౌరవ సూచకంగా ఎమ్మెల్సీ పదవిని ఇచ్చిరు. 2014 లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రిగా టిఆర్ఎస్ పార్టీ లో సీనియర్ కుమ్మర నాయకుడు అయిన తాడూరి శ్రీనివాస్ అనే కుమ్మర కులానికి చెందిన అతనికి ఎంబిసి కార్పొరేషన్ అనే కార్పొరేషన్ను సృష్టించి దానికి చైర్మన్ గా రెండు పర్యాయాలు నియమించి అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం ఏర్పడిన కొత్త కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా కుమ్మరులను ఆధరించి గౌరవించి నామినేటెడ్ పోస్టుల్లో కుమ్మరులకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ప్రతి పార్టీ ప్రభుత్వములో అదే వైయస్ రాజశేఖర్ రెడ్డి కేసీఆర్ పొలంలో కుమ్మరులకు అవకాశం కల్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కుమ్మర కులాన్ని ఆదరించి క్యాబినెట్ మినిస్టర్ హోదా గల పోస్టును కుమ్మరులకు ఇవ్వాలని డైరెక్టర్ పోస్టుల్లోనూ కొంతమందిని నియమించాలని పార్లమెంట్ ఎన్నికలు ఎదుర్కునే ముందు కుమ్మరులకు అవకాశం కల్పించి కుమ్మర సమాజం ఓట్లు పొందాలనిపొందాలని, ఈ సందర్భంగా మనవి చేస్తున్నామని చంద్రయ్య అన్నారు.

You may also like

Leave a Comment