తెలంగాణ ఎక్స్ ప్రెస్ దినపత్రిక ప్రతినిధి
వెల్గటూర్ మార్చి 06
వెల్గటూర్ మండల కేంద్రంలోని ద్వాదశ జ్యోతిర్లింగ అమరేశ్వర స్వామి దేవస్థానంలో శివపార్వతుల కళ్యాణం వైభవంగా పండితులు జరిపించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కల్యాణాన్ని వీక్షించారు శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఈ కళ్యాణం జరగడం సంతోషంగా ఉందని వచ్చిన భక్తులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు భక్తులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు
గురువారం జలాభిషేకం శుక్రవారం శివరాత్రి రోజున మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం అహోరాత్ర యాగం నిషి పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు లోక కళ్యాణం కోసం ప్రతి సంవత్సరం శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఇట్టి కార్యక్రమాలను భక్తుల సహకారంతో నిర్వహిస్తున్నట్లు ఆలయ పూజారి గంట్యాల విద్యాసాగర్ తెలిపారు ఇట్టి భక్తి కార్యక్రమంలో భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు
అమరేశ్వర స్వామి దేవస్థానంలో శివపార్వతుల కళ్యాణం
52