మిర్యాలగూడ మార్చి 6 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
నల్గొండ జిల్లాచింతపల్లి మండల కేంద్రంలోని శ్రీ సాయి సన్నిధి సాయి బాబా దేవాలయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి తనయుడు, టి .పి.సి.సి ప్రధాన కార్యదర్శి కుందూరు రఘువీర్ రెడ్డి బుధవారం సాయిబాబా దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.. దేవరకొండలో యువజన కాంగ్రెస్ పార్టీ సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్తూ మార్గ మధ్యలో సాయి నాధుడిని దర్శించుకున్నారు.. అనంతరం ఆలయకమిటీ సభ్యులు శాలువాతో ఆయనను ఘనంగా సన్మానించి సాయి చిత్ర పటాన్ని అందచేసి ఘనంగా స్వాగతం పలికారు.