Home తాజా వార్తలు ఎండపల్లి ఎమ్మార్వో కార్యాలయానికి తాళం14 నెలలుగా కిరాయి ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఇంటి ఓనర్

ఎండపల్లి ఎమ్మార్వో కార్యాలయానికి తాళం14 నెలలుగా కిరాయి ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఇంటి ఓనర్

by Telangana Express

తెలంగాణ ఎక్స్ ప్రెస్ దినపత్రిక ప్రతినిధి
వెల్గటూర్ మార్చి 06

ఎండపల్లి మండల రెవెన్యూ కార్యాలయానికి కిరాయి చెల్లించడం లేదని బుధవారం ఉదయం భవనం యజమాని తాళం వేశారు. కొత్తగా మండలం ఏర్పడిన 14 నెలల నుంచి రూ .3.66 లక్షల కిరాయి చెల్లించడం లేదని ఓనరు రాయిల్ల భూమేష్ మండిపడుతూ ఎండపల్లి తహసిల్దార్ కార్యాలయంలోని మూడు షటర్లకు తాళం వేశారు. ఆఫీస్ కు వచ్చిన ఎమ్మార్వో ఇతర సిబ్బంది షట్టర్లకు అదనపు తాళాలు వేసి ఉండడం చూసి నివ్వెరపోయారు. దీంతో కార్యాలయ సిబ్బంది బయటే ఉండిపోవాల్సివచ్చింది.

స్థానిక ఎంపీటీసీ ఎండి బషీర్ జోక్యం చేసుకొని ఓనర్ భూమేష్ తో మాట్లాడి ప్రభుత్వం నుంచి త్వరలోనే రావాల్సిన కిరాయి డబ్బులు ఇప్పిస్తానని హామీ ఇవ్వడంతో తాళాలు తీయగ యధావిధిగా కార్యాలయంలో రోజువారీ ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలకు మరోసారి తాళాలు పడకుండా ఉండే దుస్థితి రాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.అయితే ఈ ఘటనపై ఎమ్మార్వో రవికాంత్ ను వివరణ కోరగా .. తాను కొత్తగా వచ్చానని తనకేమీ తెలియదని చెప్పారు.

You may also like

Leave a Comment