లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి…. – ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు ఎల్లారెడ్డి, మార్చి, 6,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):ప్రజాపాలన అభయ హస్తం 6 గ్యారంటీల కోసం దరఖాస్తులు చేసుకుని అర్హత పొందని లబ్ధిదారుల కోసం, బుధవారం ఎల్లారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ప్రజా పాలన సేవా కేంద్రం కౌంటర్ ను ప్రారంభించినట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనవరి నెల 6 న ప్రారంభించిన ప్రజాపాలన అభయ హస్తం 6 గ్యారంటీ ల కోసం మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల నుంచి దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులకు పథకం లబ్ధి చేకూరని వారి కోసం, ప్రజాపాలన సేవా కేంద్రం కౌంటర్ ను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. లబ్ధిదారులు గృహ జ్యోతి (200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్), 500 గ్యాస్ కనెక్షన్ పథకం కోసం అవసరమైన సరైన దృవ పత్రాలతో పాటు ఇంతకు ముందు దరఖాస్తు చేసుకున్న రశీదు తో మున్సిపల్ కార్యాలయం పని వేళలు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు ఈ కౌంటర్ లో దరఖాస్తులు చేసుకోవచ్చని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు, మున్సిపల్ మేనేజర్ వాసంతి, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ (కంప్యూటర్ ఆపరేటర్) ప్రదీప్ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన దరఖాస్తుల సేవా కేంద్రం ప్రారంభం
92
previous post