మల్కాజ్గిరి జిల్లా (తెలంగాణ ఎక్స్ప్రెస్) రిపోర్టర్ : అల్వాల్ 133 మచ్చ బొల్లారం లోని మోతులకుంట చెరువు నిండా గుర్రపు డెక్క విస్తరించింది. గుర్రపు డెక్క తొలగిస్తామని జిహెచ్ఎంసి అధికారులు చెప్తున్నా పనులు అంతంతమాత్రాన జరుగుతున్నాయి. చెరువులను పరిశుభ్రంగా తీర్చిదిద్దుతామని చెప్పిన ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదు. చెరువు చుట్టూ ఉన్న పరిసరాలు కాలనీలలో దుర్గంధంగా మారడంతో పాటు దోమల వలన చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులు విష జ్వరాలు మలేరియా డెంగ్యూ క్రిమికీటకాలకు నిలయంగా మారాయి.అధికారులకు తెలిసిన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు అంటున్నారు. చెరువు దగ్గర లో స్మశాన వాటిక మరియు డంపింగ్ యార్డ్ ఉండడంతో వ్యర్థ పదార్థాలు పనికిరాని వస్తువులు డీమాలేషన్ అయినా మట్టి కుప్పలని చెరువు ప్రక్కన నింపుతున్నారు.

ప్రదర్శనలు చుట్టుపక్కల ఉన్న కాలనీవాసులు ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఇప్పటికైనా తక్షణమే గుర్రపు డెక్క తొలగించాలని కాలనీవాసులు కోరుతున్నారు.