Home తాజా వార్తలు ట్రస్మా రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా శ్రీ రామ కవచం నాగరాజు

ట్రస్మా రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా శ్రీ రామ కవచం నాగరాజు

by Telangana Express

మిర్యాలగూడ డివిజన్ తెలంగాణ ఎక్స్ ప్రెస్ మార్చి 01 : పట్టణంలోని నవజీవన హై స్కూల్ కరస్పాండెంట్ శ్రీరామ కవచం నాగరాజును ట్రస్మా రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షనిగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నిక హైదరాబాదులో గల ఉస్మానియా యూనివర్సిటీలోని, ఉస్మానియా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ రామిరెడ్డి ఆడిటోరియంలో జరిగిన ట్రస్మా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో జరిగింది. నాగరాజు ఎన్నిక పట్ల జిల్లా అధ్యక్షులు ముక్కామల రామ్మోహన్, జిల్లా సెక్రెటరీ గాదే రవీందర్ రెడ్డి, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు జొన్నలగడ్డ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కల్చర్ సెక్రటరీ షేక్. అహమ్మద్, ట్రస్మా ఫేస్ టు అధ్యక్షులు కందుల మధుసూదన్ రెడ్డి, కరస్పాండెంట్లు డేవిడ్, అరుణ్, రామిరెడ్డి, అశోక్, రాంబాబు, రియాజ్, పిట్టల శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, ఉపేందర్, వేణు ఎన్నిక పట్ల హర్షం వ్యక్తం చేశారు.

You may also like

Leave a Comment