ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 29,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎల్లారెడ్డి పట్టణంలోని స్థానిక రామాలయంలో గల పురాతన చరిత్ర కలిగిన మెట్ల బావిని, గురువారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. ఇటీవలే గత కొద్ది రోజుల క్రితం ఈ మెట్ల బావిని కలెక్టర్ పరిశీలించడం జరిగింది. దాదాపు 380 ఏళ్ల పురాతన చరిత్ర కలిగిన మెట్ల బావిని ఉపయోగంలోకి తీసుకు వచ్చి వారసత్వ సంపదను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంతో, ఆలయ ధర్మ కర్తలు సిద్ది శ్రీధర్, సిద్ది రాజేశ్వర్, సిద్ది సూర్య ప్రకాశ్ ల తో పాటు స్థానిక మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు, తహశీల్దార్ అల్లం మహేందర్ కుమార్, సర్వేయర్ అభిలాష్, గిర్డావర్ శ్రీనివాస్ లతో పాటు ద రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ ఫౌండర్ కల్పన రమేష్, వైల్డ్ లైఫ్ ఫోటో గ్రాఫర్ సిద్దార్థ్ ముఖర్జీలతో కలిసి మెట్ల బావిని పరిశీలించి, స్వయంగా కలెక్టర్ ఆలయ ధర్మ కర్త తో కలిసి బావిలో కిందకు దిగి పరిశీలించారు. అలాగే రామాలయ ఎదురుగా ఉన్న వేణుగోపాల స్వామి ఆలయం ఎదురుగా ఉన్న మరో మెట్ల బావిని సైతం పరిశీలించారు. ఈ సందర్భంగా రామాలయం కు చెందిన 26 గంటల భూమికి హద్దులు గుర్తించాలని సర్వేయర్ కు ఆదేశించారు. బావుల పునరుద్దరణకు ఆలయ ధర్మకర్తలు కూడా సుముఖత వ్యక్తం చేయడంతో, కలెక్టర్ వారిని అభినం దించారు. రెండు బావులు పునరుద్దరిస్తే, భూగర్భ జలాలను ఒడిసి పట్టవచ్చని , తద్వార సుందర పర్యాటక ప్రదేశాలుగా అభివృద్ది చెందుతాయని అన్నారు.
మార్చి 3 న శ్రమదానంలో పాల్గొనాలని యువత కు కలెక్టర్ పిలుపు….
మార్చి 3వ తేదీ ఆదివారం ఉదయం బావి పునరుద్దరణకు శ్రీకారంగా కుల మతాలకు అతీతంగా యువత ముందుకు వచ్చి శ్రమదానంలో పాల్గొనాలని కలెక్టర్ పిలుపు నిచ్చారు. తాను సైతం వచ్చి పాల్గొన నున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు, మున్సిపల్ కమిషనర్, తహశీల్దార్, సర్వేయర్, గిర్డా వర్, ద రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ ఫౌండర్, వైల్డ్ లైఫ్ ఫోటో గ్రాఫర్, ఆలయ ధర్మ కర్తలు, పట్టణ మాజీ సర్పంచ్ బత్తిని దేవేందర్, నాయకులు నాగం సాయిబాబా, సిద్ది భైరవ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.