చేగుంట ఫిబ్రవరి 29 తెలంగాణ ఎక్స్ ప్రెస్
చేగుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ను తయారుచేసి అది ఏ విధంగా పనిచేస్తుందో విద్యార్థులందరికీ వివరించడం జరిగింది. ఈ సందర్భంగా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు రఘుపతి, చల్లా లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ముఖ్యమైనవి అని, అవి పారదర్శకంగా నిర్వహించినప్పుడే ప్రజాస్వామ్యం విజయవంతం అవుతుందని , నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి మీరు భవిష్యత్తులో మీ ఓటును నిజాయితీగా వినియోగించుకున్నప్పుడే మంచి నాయకుడు ఎన్నిక అవుతారని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమ ,రాథోడ్,వెంకటేష్, భవాని,శారద, శ్రీవాణి ,లలిత,చక్రధర్ శర్మ,శృతి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు