ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 29,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల (ఎ) , ఆదర్శ కళాశాల (బి) పరీక్ష కేంద్రాల్లో, గురువారం నాడు ఇంటర్ ద్వితీయ సంవత్సర ( సెట్ “ఎ” ) తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం, జిఎఫ్ సి పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు పరీక్ష కేంద్రాల సీఎస్, డీఓ లు సిహెచ్. హేమచందర్, పి.సాయిబాబా, స్వప్న , పద్మ లు తెలిపారు. ఏ కేంద్రంలో 237 మందికి 233 మంది హాజరు కాగా 04 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జి ఎఫ్ సి వొకేషనల్ 31 మందికి గాను అందరూ హాజరయ్యారు. బి కేంద్రంలో 238 మందికి గాను 234 మంది పరీక్షకు హాజరు కాగా 4 గురు విద్యార్థులు గైర్హాజరయ్యారు. రెండు కేంద్రాల్లో కలిపి 8 మంది విద్యార్థులు గైహాజరైనట్లు సీఎస్ డీఓ లు తెలిపారు. పరీక్షలను ఎలాంటి మాస్ కాపీయింగ్ కు అవకాశం లేకుండా, ఒక్కో విద్యార్థిని కేంద్రాల వద్ద సిబ్బంది క్షుణ్నంగా తనిఖీ చేసి పరీక్షల హాల్ లోకి పంపించడం జరిగిందన్నారు.