కామారెడ్డి జిల్లా/ బాన్సువాడ ఫిబ్రవరి 28 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
బాన్సువాడ మండలంలోని తాడ్కోల్ శివారులోని బాలికల గురుకుల పాఠశాలలో గురువారం ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు ఇబ్రహీంపేట్ గ్రామానికి చెందిన ఆత్కూరి శివకుమార్ తన భార్య లక్ష్మీ పరీక్షకు హాజరు కాగా భర్త పరీక్ష కేంద్రం బయట చంటి బిడ్డను తన ఒడిలో కూర్చేబెట్టుకొని ఆడించారు.

పరీక్ష కేంద్రానికి సమయానికి రాలేదని విద్యార్థులను గేటు బయట ఉంచారు
బాన్సువాడ మండలంలోని తాడ్కిల్ గ్రామ శివారులోని బాలికల గురుకుల పాఠశాల పరీక్ష కేంద్రానికి గురువారం విద్యార్థినిలు సమయానికి చేరుకోకపోవడంతో అధికారులు పరీక్ష కేంద్రంలోనికి అనుమతించలేదు. పరీక్ష రాసే పరిస్థితి లేకపోవడంతో ఇద్దరు విద్యార్థినిలు పరీక్ష కేంద్రం నుండి నిరాశతో వెనుదిరిగారు.