-భాగం సేవ ఫౌండేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపిన ఉపాధ్యాయులుబోనకల్ , ఫిబ్రవరి 28 (తెలంగాణ ఎక్స్ ప్రెస్):భాగం సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ చేశారు. నిర్వాహకులు ఎన్ఆర్ఐ భాగం రాకేష్ విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను ప్రకటించారు. మండలంలోని ఆరు ఉన్నత పాఠశాల విద్యార్థులకు పరీక్షా ఫ్యాడ్లు, పెన్నులు స్కేల్స్ పంపిణీ చేశారు. ఫౌండేషన్ సభ్యులు భాగం రాధాకృష్ణ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు పదవ తరగతి పరీక్ష ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి మండలంలో ప్రథమ, ద్వితీయ స్థానం సాధించిన విద్యార్థులకు నగదు బహుమతిని ప్రకటించారు. బోనకల్, చిరునోముల, బ్రాహ్మణపల్లి, కలకోట, ఆళ్లపాడు, మోటమర్రి ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు ఈ సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచనలు చేశారు. సేవ సేవా ఫౌండేషన్ సభ్యులకు ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగం పాపారావు ,రాజేంద్రప్రసాద్, భాగం నాగేశ్వరరావు, గండ మాల రాయప్ప ,పారా వెంకట మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
భాగం సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరీక్షా సామాగ్రి పంపిణీ
64
previous post