Home తాజా వార్తలు మామిడాలపల్లి జడ్పీహెచ్ఎస్ లో అలరించిన వైఙ్ఞానిక ప్రదర్శన

మామిడాలపల్లి జడ్పీహెచ్ఎస్ లో అలరించిన వైఙ్ఞానిక ప్రదర్శన

by Telangana Express

వీణవంక, ఫిబ్రవరి 27( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి).

జాతీయ వైఙ్ఞానిక దినోత్సవo సందర్భంగా ముందస్తుగా వీణవంక మండలం మామిడాలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయులు తాటి రాజేశ్వర్ రావు, సురేందర్ అద్వర్యంలో విద్యార్థులచే వివిధ భౌతికశాస్త్ర, జీవశాస్త్ర ప్రయోగాల కృత్యాలను, మైటో కాండ్రియా, న్యూరాన్, హృదయం, విసర్జక వ్యవస్ట, నమూనాలను ప్రదర్శించారు. ఇందులో విద్యార్థుల చేతులపై మహేందీచే వేసుకున్న వివిధ సైన్స్ చిత్రాలు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి. ప్రదర్శనా ఆనంతర సమావేశoలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుద్దాల శోభారాణి విద్యార్థి దశ నుండే విఙ్ఞానశాస్త్రం పట్ల అవగాహన పెంపొందించుకొని భావి శాస్త్రవేత్తలుగాఎదిగి దేశ అభివృద్దికి పాటుపడాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సరితా రాణి,సరోజన,సంగీత,సుజాత,రాము, ప్రాథమిక పాఠశాల ప్రధానో పాధ్యాయులు శైలజ, తిరుపతిరెడ్డి,ప్రాథమిక, ఉన్నత పాఠశాలల విద్యార్థులు పాల్గోన్నారు.

You may also like

Leave a Comment