మండల విద్యాశాఖ అధికారి మైసాజీ
ముధోల్:27ఫిబ్రవరి(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
*పదవ తరగతి వార్షిక పరీక్షలకు విద్యార్థులు ఆత్మస్థైర్యంతో సిద్ధం కావాలని మండల విద్యాధికారి మైసాజీ అన్నారు.మంగళవారం రబింద్రా ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు వార్షిక పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించడంలో భాగంగా పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. విద్యార్థులు పరీక్షలకు సిద్ధం అవుతున్న సమయంలో వివిధ విషయాలకు సంబంధించిన సమస్యలను విషయ ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని పేర్కొన్నారు. అదేవిధంగా ఎటువంటి ఆందోళనకు గురికాకుండా పరీక్షలకు హాజరు కావాలన్నారు.వార్షిక పరీక్షలు 100% ఉత్తీర్ణత సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ అసంవార్ సాయినాథ్, కరస్పాండెంట్ రాజేందర్, డైరెక్టర్ పోతన్న యాదవ్, చైర్మన్ భీమ్ రావు దేశాయ్, ఉపాధ్యాయులు ఉన్నారు