Home తాజా వార్తలు శివశంకర్ సేవలు చిరస్మర ణీయం

శివశంకర్ సేవలు చిరస్మర ణీయం

by Telangana Express

ముధోల్:27ఫిబ్రవరి(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
న్యాయ కోవిదుడిగా,కేంద్రమం త్రిగా దివంగత పుంజాల శివశం కర్‌ దేశానికి,దళిత బహుజన సమాజానికి చేసిన సేవలు చిర స్మరణీయమని ముధోల్ మాజీ సర్పంచ్ వెంకటపూర్ రాజేందర్ అన్నారు.శివశంకర్‌ 7వ వర్ధంతి ని పురస్కరించుకొని మండల కేంద్రమైన ముధోల్ లోని ప్రధాన రహదారి,అంబేద్కర్ చౌక్ పక్కన శివశం కర్‌ విగ్రహ ఏర్పాటు స్థలం వద్ద శివశంకర్ చిత్రపటానికి మంగళ వారం పూలమాల వేసి నివాళు లర్పించారు.ఈ సందర్భంగా ప లువురు మాట్లాడుతూ విదేశాం గ,మానవ వనరుల అభివృద్ధి, న్యాయ, పెట్రోలియం శాఖల మంత్రిగా శివశంకర్‌ సేవలను స్మరించుకొన్నారు.బీసీ కులాల వర్గీకరణకు చట్ట బద్ధత కల్పిం చి,న్యాయ వ్యవస్థలో దళిత బహుజనులకు ప్రాధాన్యం పె రగడానికి ఆయన కృషి చేశా రని కొనియాడారు.ఈ కార్యక్ర మంలో తాలూక మున్నూ రుకాపు అధ్యక్షులు రోళ్ల రమే ష్,మాజీ ఉపసర్పంచ్ సంజీ వ్,నవీన్,ప్రవీణ్ ,సాయి కృష్ణ, రాకేష్,భోజన్న తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment