Home తాజా వార్తలు విద్యార్థులే ఉపాధ్యాయులుగా, అధికారులుగా వ్యవహరించిన వేళ

విద్యార్థులే ఉపాధ్యాయులుగా, అధికారులుగా వ్యవహరించిన వేళ

by Telangana Express

  • లిటిల్ స్కాలర్ టెక్నో హైస్కూల్లో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం
  • ఆకట్టుకున్న విద్యార్థుల నృత్యాలు

ఆమనగల్లు, ఫిబ్రవరి 27
(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణంలోని లిటిల్ స్కాలర్ టెక్నో హైస్కూల్లో స్కూల్ చైర్మన్ చుక్క అల్లాజి గౌడ్ ఆధ్వర్యంలో విద్యార్థులే ఉపాధ్యాయులుగా, అధికారులుగా వ్యవహరించి ఘనంగా స్వపరిపాలన దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఉదయం నుండి సాయంత్రం వరకు సాంప్రదాయక దుస్తులను అలంకరించి తరగతిలో నిర్వహించారు. సుమారుగా 80 విద్యార్థులు ట్రెడిషనల్ ఫెయిర్ లో ,100 ఉపాధ్యాయులుగా వ్యవహరించారు. తాత్కాలిక కలెక్టర్ గ వైష్ణవి, ప్రిన్సిపల్ గా శ్రావిత, కరస్పాండెంట్ గా పూజ, డైరెక్టర్ గా వినయ్, చైర్మన్ గా శివ ,అకాడమిక్ అడ్వైసర్ గా అమూల్య,ఉనిున్ ఫైనాన్స్ మినిస్టర్ గా స్నేహిత్, జాయింట్ కలెక్టర్ గా శివ కుమార్, ఆర్ జెడిగా చైతన్య, స్పోర్ట్ మినిస్టర్ మహేష్ పాల్గొన్నారు. అనంతరం స్థానిక భవాని ఫంక్షన్ హాల్లో పాఠశాల యాజమాన్యం ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో చూడటానికి రెండు కళ్ళు అన్నట్టుగా విధ్యార్థుల నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ సుజాత, అకాడమిక్ అడ్వైజర్ సుదర్శన్ రెడ్డి, డైరెక్టర్ సావిత్రి, ఉపాధ్యాయులు శ్వేత, స్వాతి, హైమావతి, చలం, యాదయ్య, శ్రీశైలం, వెంకటేశ్వర్లు, శ్రీ జన్య, రాధిక, గీత, మమత, తేజ, నందిని, రాధిక, వరలక్ష్మి, ఝాన్సీ, లక్ష్మి, నాగమణి, దీప్తి, సునంద, అలేఖ్య తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment