Home తాజా వార్తలు మిర్యాలగూడ డివిజన్ వ్యాప్తంగా… “గృహజ్యోతి” ఉచిత విద్యుత్ ప్రయోజనం పొందనున్న 84,220 వినియోగ దారులు: విద్యుత్ డి ఈ వెంకటేశ్వర్లు

మిర్యాలగూడ డివిజన్ వ్యాప్తంగా… “గృహజ్యోతి” ఉచిత విద్యుత్ ప్రయోజనం పొందనున్న 84,220 వినియోగ దారులు: విద్యుత్ డి ఈ వెంకటేశ్వర్లు

by Telangana Express

మిర్యాలగూడ ఫిబ్రవరి 27 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలలో మరో రెండింటిని పకడ్బందీగా అమలు చేసేందుకు మంగళవారం శ్రీకారం చుట్టారు. గృహజ్యోతి పథకం ద్వారా విద్యుత్ గృహ వినియోగదారులకు 200 యూనిట్ వరకు ఉచిత విద్యుత్ ప్రయోజనం పొందనున్నారు. ఈ సందర్భంగా “తెలంగాణ ఎక్స్ ప్రెస్” ప్రతినిధితో మిర్యాలగూడ విద్యుత్ డిఈ. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని 13 మండలాలలో 1,33,674 మంది విద్యుత్ గృహ వినియోగదారులు ఉన్నారని, అందులో ఆహార భద్రత రేషన్ కార్డులు ఆధార్ నెంబర్ లింక్ చేసుకొని డివిజన్ వ్యాప్తంగా 84,220 మంది (63 శాతం) గృహ వినియోగదారులు ఉచిత విద్యుత్ ప్రయోజనం పొందనున్నారని తెలిపారు. డివిజన్ వ్యాప్తంగా గృహ జ్యోతి పథకం కింద రేషన్ కార్డు ఉన్నవారికి నెలకు 200 యూనిట్ ఉచిత కరెంటు పొందనున్న వివరాలు ఇలా ఉన్నాయి. మిర్యాలగూడ వన్ టౌన్ లో 25,934 మంది గృహ వినియోగదారులు ఉండగా 12,729 మంది ఉచిత విద్యుత్ ప్రయోజనం పొందనున్నారు. మిర్యాలగూడ టౌన్-2, పరిధిలో 14,760 మంది గృహ వినియోగదారులు ఉండగా 9,075 మంది గృహ వినియోగదారులు ఉచిత ప్రయోజనం పొందేందుకు
అర్హులన్నారు. మిర్యాలగూడ మండలం లో 15,669 గృహ మంది వినియోగదారులు ఉండగా 11623 మంది వినియోగదారులు ఉచిత ప్రయోజనం పొందనున్నారని తెలిపారు. అడవి దేవులపల్లి లో 3128 గృహ వినియోగదారులు, 2621 (ఉచిత ప్రయోజనం) దామరచర్ల మండలంలో 11024 మంది గృహవినియోగదారులు, 79 31 (ఉచిత ప్రయోజనం) మాడుగుల పల్లి మండలంలో 7,832 మంది గృహ వినియోగదారులు, 6559 (ఉచిత ప్రయోజనం) త్రిపురారం మండలంలో 8,234 మంది గృహ వినియోగదారులు 6,668 మంది ఉచిత ప్రయోజనం పొందనున్నారు. వేములపల్లి మండలంలో 53 79 మంది గృహ వినియోగదారులు 42 19 (ఉచిత ప్రయోజనం) హాలియా (అనుముల) మండలం లో 11737 గృహ వినియోగదారులు 65 44 ఉచిత ప్రయోజనం పొందన్నారు. నాగార్జునసాగర్ మండలంలో 44 91 మంది గృహ వినియోగదారులు 1,950 ఉచిత ప్రయోజనం పొందుతున్నారు. నిడుమనూరు మండలంలో 91 38 మంది గృహ వినియోగదారులు 67 16 మంది ఉచిత ప్రయోజనం పొందనున్నారు. పెద్దవూర మండలంలో 66 74 మంది గృహ వినియోగదారులు 44 84 మంది ఉచిత విద్యుత్ ప్రయోజనం పొందనున్నారు. తిరుమలగిరి సాగర్ మండలంలో 4556 మంది గృహ వినియోగదారులు 3083 మంది ఉచిత విద్యుత్ ప్రయోజనం పొందనున్నారని డి ఈ. వెంకటేశ్వర్లు తెలిపారు. డివిజన్ వ్యాప్తంగా 200 యూనిట్ ఉచిత విద్యుత్ ప్రయోజనం పొందేందుకుగాను రేషన్ కార్డు ఆధార్ నెంబర్ లింక్ చేయించుకున్న వారు 63% శాతం వరకు ఉన్నారని, రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఈ నెల 29 వరకు అర్హులైన వారందరూ రేషన్ కార్డ్ ఆధార్ లింక్ చేయించుకోవాలని, ప్రభుత్వం కల్పిస్తున్న లబ్ధిపొందవచ్చునని
ఆయన తెలిపారు. గృహ జ్యోతి పథకం ఇండ్లలో కిరాయి ఉన్నవారికి కూడా “గృహజ్యోతి’ వర్తిస్తుందన్నారు. మిర్యాలగూడ డివిజన్ వ్యాప్తంగా విద్యుత్ కు కొదవలేదని నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు వ్యవసాయానికి సరిపడా విద్యుత్ సరఫరా నిరంతరంగా కొనసాగించేందుకు తగిన చర్యలుతీసుకుంటున్నామన్నారు. విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా నిరంతరం విద్యుత్ సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నామని డి ఈ వెంకటేశ్వర్లు తెలిపారు. అధికారుల అనుమతి తీసుకోకుండా సిబ్బంది “ఎల్ సి” తీసుకోకూడదని ఆదేశాలు జారీ చేశామన్నారు. వేసవికాలం దృష్టి పెట్టుకొని విద్యుత్ సరఫరా చేయనున్నట్లు తెలియజేశారు.

You may also like

Leave a Comment