అతిధి డెవలపర్స్ అధినేత కొమ్మిడి రాకేష్ రెడ్డి…
వీణవంక, ఫిబ్రవరి 26( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి ).
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం హిమ్మత్ నగర్ కి చెందిన మాజీ ఉపసర్పంచ్ మడికంటి రామస్వామి గత కొంతకాలంగా అనారోగ్యం తో బాధపడుతూ,ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అతడి పరిస్థితి కొమ్మిడి రాకేష్ రెడ్డి దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించిన అతిధి డెవలపర్స్ అధినేత, కాంగ్రెస్ నాయకులు కొమ్మిడి రాకేష్ రెడ్డి,సోమవారం తన సొంత ఖర్చులతో అంబులెన్స్ ఏర్పాటుచేసి, హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి
పంపించడం జరిగింది. అనంతరం హిమ్మత్ నగర్ గ్రామ ప్రజలు మాట్లాడుతూ… అనారోగ్య బారిన పడిన మడి కంటి రామస్వామికి వైద్య సహాయం అందిస్తున్న మానవతావాది కొమ్మిడి రాకేష్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.