సిపిఎం ఆధ్వర్యంలో ప్రభుత్వానికీ విజ్ఞప్తి
మంచిర్యాల, ఫిబ్రవరి 26, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): మంచిర్యాల జిల్లా, జన్నారం మండల పట్టణంలో సిపిఐ కార్యాలయంలో అర్హులైన పేదలకు రేషన్ కార్డులు పంపిణీ చేసి, పేదల సమస్యలు పరిష్కరించాలని, కె బుచ్చన్న అధ్యక్షతన ప్రభుత్వానికి తెలియపరిచే విధంగా పేదల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా సిపిఎం మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకే రవి హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీ లు, ఇతర హామీలను అమలు చేసి పేదల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రతి పథకానికి తెల్ల రేషన్ కార్డును లింకు చెయ్యడం వల్ల పేదలు ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వం 10 సం కాలంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. కార్డున్న వారి కుటుంబ సభ్యుల పేర్లు కూడ నమోదు చెయ్యలేదు. దినివలన నేడు పేదలు ఆందోళన చెందుతున్నారు.
మండలంలో పోడు భూములకు హక్కు పత్రలివ్వాలి. హక్కు పత్రలున్న భూముల సాగు చేసుకొనివ్వాలి. ఫారెస్ట్ శాఖ ఆగడాలను నిలిపివెయ్యాలి.
ఇంటి స్థలాలు,ఇండ్ల కోసం మండలంలో పేదలు సం. రాల తరబడి పోరాటం చేస్తున్నారు. గత ప్రభుత్వం పట్టించుకోలేదు. మండలంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీ పోస్టులన్ని భర్తీ చేసి,రోగ నిర్దారణ కోసం ల్యాబ్ ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్యం 24 గంటలందించాలి. ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు జరిపాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి కనికరపు అశోక్, మండల నాయకులు కె బుచ్చన్న, ఎస్ కె అబ్దుల్లా, మగ్గిడి జయ, ఒడిపెల్లి ప్రమీల, జి రాజన్న, అత్రం రాజు, కె లింగన్న, భీమక్క, అన్నిబాయి