టిపిసిసి కార్యదర్శి పెర్క శ్యామ్
మంచిర్యాల, ఫిబ్రవరి 26, (తెలంగాణ ఎగ్స్ ప్రెస్): మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సింగరేణి కార్మికులు టిపిసిసి కార్యదర్శి పెరిక శ్యామ్ ను కోరారు. నస్పూర్ ప్రెస్ క్లబ్ లో ఐఎన్ టియుసి శ్రీరాంపూర్ డివిజన్ ఉపాధ్యక్షులు శంకర్ రావు ఆధ్వర్యంలో జరిగిన శ్రీరాంపూర్ డివిజన్ ఐఎన్ టియుసి ముఖ్య కార్యకర్తల సమావేశంలో పెద్దపల్లి పార్లమెంట్ నాయకులు, టిపిసిసి కార్యదర్శి పెర్క శ్యామ్ ముఖ్య అతిధి పాల్గొన్నారు. ఈ సమావేశంలో పెర్క శ్యామ్ మాట్లాడుతూ సింగరేణి కార్మికులు ఎదురకొంటున్న సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో జరగబోయే పెద్దపల్లి ఎంపి ఎన్నికల్లో ఐఎన్ టియుసి కార్యకర్తలు, సింగరేణి కార్మికులు ప్రధాన పాత్రలో ముందు ఉండి కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేసారు. ఈ ప్రజా ప్రభుత్వంలో కార్మికులు సంతోషంగా ఉంటారని. సింగరేణి కార్మికులకు అన్ని రకాల సౌకర్యాల ఏర్పాటుకు మంత్రి శ్రీధర్ బాబు సంబంధిత అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారి చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభించి, కార్మికులను వంచన గురించేసిందన్నారు. ప్రజా నాయకులు మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కార్మికులకు తోడుంట్టారని, కార్మిక హక్కుల సాధించి పెట్టే నాయకుడని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి సమస్య తీర్చే జవాబు దారితనం ఉందని. ప్రతి కార్మిక సమస్యను పరిస్కారం చూపడానికి అపార అనుభవం కలిగిన ఐఎన్ టియుసి సెక్రటరీ జెనరల్ జనక్ ప్రసాద్ ఐఎన్ టియుసి స్థానిక నాయకులు సింగరేణి కార్మికులకు తోడుగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎన్ టియుసి శ్రీరాంపూర్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ శంకర్ రావు, ఐఎన్ టియుసి సీనియర్ నాయకులు గరిగే స్వామి, పేరం స్వామి, పిన్నింటి మల్లారెడ్డి, విజయపాల్, ల్యాగల శ్రీనివాస్, తిరుపతి, రాజు, శ్రీనివాస్, కె తిరుపతి, ధరణి సాయి తదితరులు పాల్గొన్నారు.