అమనగల్లు, ఫిబ్రవరి 26
(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ప్రతి ముస్లిం అల్లా అడుగు జాడల్లో నడుస్తు పరుల హితాన్ని కోరుకోవాలని మౌలానా అబ్దుల్ వహిద్, లతిఫ్ లు సూచించారు. ఆదివారం రాత్రి పట్టణంలో జామ మస్జీద్, మహ్మదియా మస్జీద్, మస్జీద్ హమాదే హిలాల్ లో ముస్లిం లు షబ్ ఎ బరాత్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా రాత్రి ముస్లిం లు ప్రత్యేక ప్రార్థనలు, మౌలానా లు బయన్ నిర్వహించారు. అనంతరం జాగరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా మత గురువులు మాట్లాడుతూ ప్రతి ముస్లిం అల్లా సూచించిన మార్గం లో ఆయన అడుగు జాడల్లో పయనించాలన్నారు. అల్లా చూపిన మార్గంలో ముందుకు సాగుతు పవిత్ర త్యాగం నీతి నిజాయితీ లకు మారుపేరు గా ముస్లిం మైనారిటీ లు ఎదగాలని వారు పేర్కొన్నారు. ముస్లిం ప్రవిత్ర గ్రంథంలో ఖురాన్ పొందుపరిచిన అంశాలు ఖురాన్ విశిష్టత ముస్లిం అలవార్చుకోవాల్సిన పద్ధతులు తదితర విషయాలపై ముస్లింలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను గౌరవించాలని వారు సూచించారు. అనంతరం ఆయా మస్జీద్ లలో నిర్వహించిన దువా జాగరణ కార్యక్రమం లో ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.