జడ్చర్ల, ఫిబ్రవరి, తెలంగాణ ఎక్స్ ప్రెస్:షాబ్ ఏ బరాత్ వేడుకలు ఆదివారం జడ్చర్ల నియోజకవర్గం లోని అన్ని మండల కేంద్రాలలో ని మస్జిద్ లలో ఘనంగా నిర్వహించారు. విద్యుత్ దీపాలతో అన్ని మస్జిద్ లను అలంకరించారు. జడ్చర్ల ,రాజాపూర్, బాలానగర్,నవాబ్ పేట, మిడ్జిల్,ఊరుకొండ మండల కేంద్రం లలో ముస్లింలు సాయంత్రం తమ ఇండ్లలో తమ పెద్దలను స్మరించుకుంటూ ప్రత్యేక ఫాతేహాలు నిర్వహించి అనంతరం మసీదులలో సామూహిక ఇషా నమాజులు చేపట్టారు.ఈ సందర్భంగా మజీద్ లలో షాబ్ ఏ బరాత్ యొక్క ప్రత్యేకతను మౌల్విలు, ఇమామ్లు వివరించారు.నేటి రాత్రి అల్లా వాగ్దానం మేరకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి మూడుసార్లు యాసీన్ పఠణం చేపట్టి అల్లా తో దువా చేస్తే తాము కోరిన కోరికలను తప్పకుండా నెరవేరుస్తాడని వివరించారు.అనంతరం మజీద్ లలో ఇమామ్ లు యాసీన్, ఖత్మే ఖురాన్ నిర్వహించి తాము మానవ జీవితంలో తెలిసి తెలియక చేసిన తప్పులను మన్నించి సన్మార్గంలో నడిపించాలని అల్లాను వేడుకున్నారు. అనంతరం ముస్లిం సోదరులు మధ్య రాత్రి కబ్రస్తాన్లకు వెళ్లి తమ పూర్వీకుల సమాధుల వద్ద ఫతేహలు నిర్వహించి వారిని స్మరించుకున్నారు.షాబే ఏ బరాత్ సందర్భంగా ఆయా మసీదులలో పలువురు దాతలు తేనేటి విందు ఇచ్చారు.మస్జిద్ సదర్, ఇమామ్,పెష్మాం,లను శాలువా కప్పి పూలమాలతో ఘనంగా సత్కరించారు.
ఘనంగా షాబ్ ఏ బరత్ వేడుకలు విద్యుత్ దీపాలతో మజ్జిద్ లకు అలంకరణ
59
previous post