ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 24, (తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ప్రతి ఒక్క విద్యార్థి కష్టపడి కాకుండా ఇష్టపడి ఉన్నత స్థాయికి ఎదగాలి అని, జీవదాన్ హై స్కూల్ ప్రిన్సిపాల్ ఫాదర్ బాబు సూచించారు. శనివారం ఎల్లారెడ్డి పట్టణంలోని జీవదాన్ హై స్కూల్లో పదో తరగతి విద్యార్థులకు, 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఫాదర్ బాబు మాట్లాడుతూ ఇష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి ఎదుగుతూ జీవితంలో మంచిగా స్థిరపడాలని అప్పుడే తల్లిదండ్రులు సంతోషిస్తారు అన్నారు. తద్వారా సమాజంలో మంచి గుర్తింపును పొందవచ్చని అన్నారు. సమాజంలో మార్పు విద్య ద్వారానే సాధ్యమవుతుందని, విద్యార్థులు క్రమశిక్షణ పాటిస్తూ లక్ష్యం నిర్దేశించుకుని లక్ష్య సాధనకు ముందుకు సాగాలన్నారు. రోజూ రోజుకు పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం మన అభివృద్ధికి వినియోగించుకొని, తల్లి, దండ్రులకు పాఠశాలకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకు రావాలన్నారు. అనంతరం విద్యార్థులు పాఠశాలలో ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విద్యార్థుల కేరింతలతో, చప్పట్లతో పాఠశాల ఆవరణం మారుమోగింది. అనంతరం విద్యార్థులు సామూహికంగా విందారగించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఫాదర్ బాబు, వైన్స్ ప్రిన్సిపాల్ ఫాదర్ జోబీస్, ఉపాధ్యా యులు షాదుల్ల, సతీష్ గౌడ్, మాణిక్య ప్రభు, భాగ్యలక్ష్మి, నిర్మల, స్మిత, రాజు , నాగరాజు, భైరవ ప్రసాద్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.