: మారం శ్రీనివాస్
మిర్యాలగూడ నియోజవర్గం ఫిబ్రవరి 23 తెలంగాణ ఎక్స్ ప్రెస్/ మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గం కోటపెల్లి మండలం సిరువంచ-చతిస్గడ్ జాతీయ రహదారి పక్కన ఉన్న బోరంపెల్లి గ్రామంలో మహాత్మ జ్యోతిరావు పూలే- తల్లి సావిత్రిబాయి పూలే మహానీయుల విగ్రహాలను ధ్వంసం చేసి దుడంగుడుని వెంటనే శిక్షించాలి. విద్యుత్తు బిసి ఉద్యోగులు మారం శ్రీనివాస్, పెరికేటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే, తల్లి సావిత్రిబాయి పూలే ప్రజలకు అక్షరాన్ని, విద్య రూపంలో నేర్పిన మహానుభావుల విగ్రహాలను ధ్వంసం చేసిన దుడంగుణ్ణి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వెంటనే శిక్షించాలని, అదేవిధంగా ప్రభుత్వం నూతన విగ్రహాలను ఏర్పాటు చేసే విధంగా చూడాలని, మహాత్ముల విగ్రహాలను ధ్వంసం చేయకుండా పునారవతం సంఘటనలు జరగకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.. బచ్చు రామచందర్, పెద్దోజు నరసింహాచారి తదితరులు పాల్గొన్నారు.