నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ప్రజాపాలన వచ్చింది …
ప్రతిపక్షాలపై భగ్గుమన్న మంత్రి పొన్నం ప్రభాకర్…
వీణవంక, ఫిబ్రవరి 23 ( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి).
కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో జరుగుతున్న శ్రీ సమ్మక్క- సారలమ్మ ల ను, శుక్రవారం తెలంగాణ రాష్ట్ర బిసి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ విచ్చేయగా,కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ మహిళా నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చి గజమాలతో సత్కరించి, పూలమాలలు వేస్తూ, శాలువతో ఘనంగా సత్కరిస్తూ, స్వాగతం పలుకగా, ఆలయ ప్రాంగణంలో జాతర ధర్మకర్త,యుఫ్ టీవీ సీఈవో ఉదయ్ రెడ్డి, పిసిసి మెంబర్ కర్ర భగవాన్ రెడ్డి లు రాష్ట్ర మంత్రిని శాలువా కప్పి సన్మానించారు. అనంతరం రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సమ్మక్క- సారలమ్మలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

అనంతరం వారు మాట్లాడుతూ… వీణవంక సమ్మక్క- సారలమ్మలను వనదేవతల ఆశీర్వాదంతో వర్షాలు బాగా కురవాలని, రైతన్నలు సంతోషంగా ఉండాలని, తెలంగాణ రాష్ట్రంలో రైతులకు వ్యవసాయానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉండవద్దని, ఆ దేవతల ఆశీర్వాదాన్ని తో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, వన దేవతల ను ప్రార్థించామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నియంతృత్వ పోకడకు వ్యతిరేకంగా ప్రజా పాలన వచ్చిందని, ప్రతిపక్షాలు కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిఆర్ఎస్ ఏం సాధించిందో చెప్పాలని, ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని కూల్చే చేస్తామంటూ, పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని, కొందరు వ్యక్తులు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ప్రతిపక్షాలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని మండిపడ్డారు. ఈ దర్శన కార్యక్రమంలో హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ వొడితల ప్రణవ్,కాంగ్రెస్ నాయకులు పత్తి కృష్ణారెడ్డి,మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి, సీనియర్ నాయకులు సాహెబ్ హుస్సేన్, మండల అధ్యక్షులు శ్యాంసుందర్ రెడ్డి, పూదరి రేణుక గౌడ్,పుల్లారెడ్డి, సమ్మిరెడ్డి, వీరేశం, నల్ల కొండల్ రెడ్డి,
రఘుపాల్ రెడ్డి, కోమ్మిడి రాకేష్ రెడ్డి, మ్యాక వీరయ్య, నల్ల కొండల్ రెడ్డి, మాదాసు సునీల్,
సతీష్ కుమార్ యాదవ్, జడల శ్రీకాంత్, గొట్టే రాజయ్య, రజాక్, అనిల్ రెడ్డి, బొంగోని వీరస్వామి, మద్దుల ప్రశాంత్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ యువ నాయకులు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
