Home తాజా వార్తలు భారత్ మాల బాధితులకు న్యాయం చేయాలి

భారత్ మాల బాధితులకు న్యాయం చేయాలి

by Telangana Express
  • సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారికి వినతిపత్రం. మక్తల్,ఫిబ్రవరి 22:- ( తెలంగాణ ఎక్స్ ప్రెస్): నారాయణపేట జిల్లాలోని మక్తల్ , నారాయణపేట నియోజకవర్గాల పరిధిలోని 56 కిలోమీటర్ల మేర నిర్మాణం అవబోతున్న భారత్ మాల జాతీయ రహదారి భూ బాధిత రైతులకు బహిరంగ మార్కెట్ ప్రకారం ధర చెల్లించి న్యాయం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ,
    కొత్తగూడెం ఎమ్మెల్యే
    కూనంనేని సాంబశివరావు గారిని భారత మాల బాధితులూ కలిసి విఙ్ఞప్తి చేశారు.
    గురువారం నాడు నారాయణపేట జిల్లా భారత్ మాల భూ బాధిత రైతులు కూనంనేని సాంబశివరావు గారిని కలిసి తమ గోడుని వెళ్ల బోసుకుని , తమకు న్యాయం జరిగేలా చూడాలని హిమాయత్ నగర్ లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో కూనంనేని గారికి వినతిపత్రాన్ని అందించారు.
    ఈ సందర్భంగా సిపిఐ నారాయణపేట జిల్ల కార్యదర్శి కొండన్న మాట్లాడుతూ… నారాయణపేట జిల్లా మరికల్, జక్లేరు, మక్తల్, మాగనూరు, టై రోడ్డు. వాసవి నగర్ ల, గుండా 56 కిలోమీటర్ల పరిధిలోని 19 గ్రామాల రైతులూ/ప్లాట్ల యజమానులూ పేదల భూమిని సేకరించిన కేంద్ర ప్రభుత్వము నష్టపరిహారం ఇవ్వడంలో మాత్రం తీవ్ర జాప్యము , నిర్లక్ష్యం చేస్తున్నదని ఆయన అన్నారు.
    ఆల్రెడీ గతం నుంచే జాతీయ రహదారిగా ఉన్న గోవా టు హైదరాబాద్ రోడ్డుకు భారత మాల ట్యాగ్ తగిలించి… ఈ ప్రాంతంలో కోటిన్నర రెండు కోట్ల రూపాయల విలువ ధర పలికే భూములకు అధికారులు 4 , 5 లక్షల రూపాయల పరిహారం , 30 , 40 వేల రూపాయల కు గజం ధర పలికే ప్లాట్లకు అతితక్కువ ధర ఇస్తామనడం ఎంతవరకు సమంజసమైనదని కొండన్న ప్రశ్నించారు.
    ఎన్ హెచ్ ఏ ఐ అధికారులు తగిన భూ నష్టపరిహారం ఇవ్వకుండా… రైతులను సంవత్సరాల తరబడి ఇబ్బందులకు గురిచేస్తూ…. ఇవ్వాలనుకూన్న అరకొర నష్ట పరిహారాన్ని కూడా ఇవ్వకుండా… చట్ట విరుద్ధంగా , అన్యాయంగా కోర్టుకెళ్లడం హాస్యాస్పదమూ… దారుణమైన విషయమని , కేంద్ర ప్రభుత్వ అధికారుల ఆ చర్య భారత భూ నష్టపరిహార చట్టానికే విరుద్ధమైనదని ఆయన అన్నారు.
    ఇప్పటికైనా నారాయణపేట జిల్లా భారత్ మాల భూ భాదిత రైతులూ/ ప్లాట్ల యజమానులకు బహిరంగ మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం వెంటనే చెల్లించాలని కొండన్న డిమాండ్ చేశారు .
    ఈ కార్యక్రమంలో సిపిఐ మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి , సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు , తక్కెళ్ళపల్లి శ్రీనివాసరావు ఎం బాల నరసింహ , సిపిఐ నారాయణపేట జిల్లా కార్యదర్శి కొండన్న , భారత్ మాల భూ బాధితులు రంకుల రాం లింగమ్. ప్రసాద్ , సతీష్ , రాఘవేందర్ అశోక్. తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment