Home తాజా వార్తలు ఈ నెల 25 న గురుకుల సిఓఈ సెకండ్ లెవెల్ స్క్రీనింగ్ పరీక్ష…- కామారెడ్డి జిల్లా గురుకులాల సమన్వయ కర్త క్రాంతి కృతామూర్తి

ఈ నెల 25 న గురుకుల సిఓఈ సెకండ్ లెవెల్ స్క్రీనింగ్ పరీక్ష…- కామారెడ్డి జిల్లా గురుకులాల సమన్వయ కర్త క్రాంతి కృతామూర్తి

by Telangana Express

ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 22,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

సి ఓ ఈ ( సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ) గురుకులాల్లో ప్రవేశాల కోసం సెకండ్ లెవెల్ స్క్రీనింగ్ పరీక్ష, ఈ నెల 25 వ తేదీ ఆదివారం ఉదయం 10.00 గంటల నుంచి 1.00 గంట వరకు కామారెడ్డి జిల్లాలోని దోమకొండ టి ఎస్ డబ్లూ ఆర్ ఎస్ / కళాశాల (బాలికల) లో ఉంటుందని, జిల్లా గురుకులాల సమన్వయ కర్త, ఎల్లారెడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాల ప్రిన్సిపాల్ క్రాంతి కృతామూర్తి , గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2023-24 విద్యా సంవత్సరంలో 10 వ తరగతి చదువుతున్న విద్యార్థులు సి ఓ ఈ ఫస్ట్ లెవెల్ స్క్రీనింగ్ పరీక్ష కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఈ నెల 4 న వ్రాసారని, పరీక్షలో పాస్ ఐనవారు మాత్రమే సెకండ్ లెవెల్ స్క్రీనింగ్ పరీక్ష వ్రాయడానికి అర్హులని తెలిపారు. హాల్ టికెట్లను డబ్లుడబ్లుడబ్లు.టిఎస్డబ్లుఆర్ఈఐఎస్ .కో.ఇన్ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని కోరారు. సెకండ్ లెవెల్ లో పాస్ ఐన వారు సి ఓ ఈ గురుకుల కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరంలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో చేరవచ్చని తెలిపారు. సిఓఈ ఫస్ట్ లెవెల్ స్క్రీనింగ్ పరీక్ష పాస్ ఐన విద్యార్థులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ క్రాంతి కృతా మూర్తి కోరారు. పరీక్ష కేంద్రానికి విద్యార్థులు గంట ముందే చేరుకోవాలని సూచించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలలో సుద్దపల్లి, ధర్మారం గురుకులాల్లో సి ఓ ఈ సెట్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

You may also like

Leave a Comment