వీణవంక, ఫిబ్రవరి 22( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి).
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం శ్రీరాములుపేట గ్రామానికి చెందిన కోల,సంతోష్ అనే యువకుడు గత నెల రోజుల క్రితం ట్రైన్ ఏక్సిడెంట్ లో చనిపోగా అతనితో 2010 సం. 10 వ తరగతి చదువుకున్న తోటి స్నేహితులంతా కలిసి గురువారం వారి కుటుంబాన్ని పరమర్శించి, వారికి ధైర్యాన్ని ఇచ్చి, వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని తెల్పి, ఆ కుటుంబానికి 41000(నలభై ఒక్క వేల) రూ..లు ఆర్థిక సహాయంగా అందివ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో అతనిమిత్రులు,సదానందం,మారుతి,శంకర్,రఘు,కుమార్,ప్రసాద్ సుధాకర్, రాము, భాస్కర్,మధు తదితరులు పాల్గొన్నారు.