Home తాజా వార్తలు నిజాంసాగర్ బ్యాక్ వాటర్ లో పడి యువకుని మృతి

నిజాంసాగర్ బ్యాక్ వాటర్ లో పడి యువకుని మృతి

by Telangana Express

ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 22,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

కుటుంబ కలహాలతో ఓ యువకుడు నిజాంసాగర్ బ్యాక్ వాటర్ లో పడి మృతి చెందిన సంఘటన, గురువారం చోటు చేసుకుంది. స్థానిక ఎస్ఐ బొజ్జ మహేష్ తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. లింగంపేట్ మండలం శెట్పల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన చాకలి సాయిబాబు (30), ఎల్లారెడ్డి మండలం జంగమయి పల్లి గ్రామానికి ఇల్లరికం అల్లుడిగా 7 ఏళ్ల క్రితం చాకలి కలవ్వ తో వివాహం అయ్యింది. గత కొద్ది కాలంగా కుటుంబ కలహాలతో సాయిబాబా విసిగి వేసారి, బుధవారం భార్యతో గొడవ పడి గ్రామ శివారులోని నిజాంసాగర్ బ్యాక్ వాటర్ లో పడి తనువు చాలించాడు. గురువారం ఉదయం మృతదేహం నీటిపై తేలడంతో, స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు తెలపగా , గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బ్యాక్ వాటర్ వద్దకు చేరుకుని శవాన్ని బయటకు తీశారు. మృతుని భార్య కలవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బొజ్జ మహేష్ వివరించారు. మృతునికి 3 నెలల కూతురు ఉందని గ్రామస్తులు తెలిపారు.

You may also like

Leave a Comment