Home తాజా వార్తలు పంజాబ్ రైతులపై హర్యానా పోలీసుల కాల్పులను ఖండించండి

పంజాబ్ రైతులపై హర్యానా పోలీసుల కాల్పులను ఖండించండి

by Telangana Express

మంచిర్యాల జిల్లా కార్యదర్శి,
తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఏఐకెఎస్ కొండుబానేష్

మంచిర్యాల, ఫిబ్రవరి 22, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): ఫిబ్రవరి 20న సాయంత్రం సుమారు 7 గంటల ప్రాంతంలో హర్యానా పంజాబ్ సరిహద్దుల్లో హర్యానాకు చెందిన పోలీసులు ఫాసిస్ట్ అంతక స్వభావంతో అత్యంత కరకషంగా జరిపిన కాల్పులలో పంజాబ్ రాష్ట్రానికి చెందిన బటిండా జిల్లాలోని బాలన్ గ్రామానికి చెందిన 24 సంవత్సరాల యువకుడు శుభ కరన్ సింగ్ మరణించాడు, ఈ నరాంతక దాడిని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం తీవ్రంగా ఖండిస్తుంది, బరితెగించి కాల్పులకు తెగబడిన సంబంధిత హర్యానా పోలీసుల ను వెంటనే హత్యా నేరం కింద అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తుంది, ఈ కాల్పుల సంఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత సమగ్ర విచారణ జరిపించాలన డిమాండ్ చేస్తుంది, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం రైతుల పండించిన పంటకు ఎంఎస్, పి అంటే రైతులు పండించిన పంటలన్నింటికీ కనీస మద్దతు ధర ఉత్పత్తి వ్యయంపై ఒకటిన్నర రేట్లు చెల్లించాలని రుణ విమోచన చట్టం తీసుకురావాలని విద్యుత్ సవరణ బిల్లు ద్వారా విద్యుత్తు రంగ ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలని, కౌలు రైతులకు తగిన రక్షణ కల్పించాలని, మూడు వ్యవసాయ సాగు చట్టాలను బేసిక్ గా ఉపసంహరించుకోవాలని ఢిల్లీ కేంద్రంగా సాగిన చారిత్రాత్మకమైన రైతాంగ పోరాటం మరణించిన 750 మంది రైతు కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని తదితర పరిష్కారం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతి యుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై అమనూషంగా కాల్పులు చేయడం నరేంద్ర మోడీ ప్రభుత్వ కార్పోరేట్ మతతత్వ విధానాలకు నిదర్శనమని తెలంగాణ రాష్ట్ర మూడు రైతు సంఘం అభిప్రాయపడుతుంది, ఢిల్లీ కేంద్రంగా సాగిన రైతాంగ పోరాటం సందర్భంగా మూడు నెలల సాగు చట్టాల ఉపసహరణకు రైతుల పంటలకు ఎం ,యఫఆ ఎస్, పి, ఇస్తామన్నా నరేంద్ర మోడీ రాతపూర్వక హామీని అమలు చెయ్యని కారణంగా తిరిగి ఉద్యమ బాట పట్టిన రైతుల న్యాయ మైన ఈ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాల్సిన బాధ్యతను విస్మరించి నిర్బంధం ద్వారా అణిచివేత ద్వారా ఉద్యమాన్ని ఆపాలనుకోవడం ఫాసిస్ట్ ఆలోచన తప్ప వేరే కాదని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం పేర్కొన్నది శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై హర్యానా పోలీసులు జరిపిన కాల్పులను ఖండించవలసిందిగా ప్రజలను ప్రజాస్వామిక వాదులను మేధావులను కోరుతున్నమని తెలిపారు.

You may also like

Leave a Comment