Home తాజా వార్తలు బిచ్కుంద మున్నూరు కాపు సంఘంలో సన్మాన సభలో పాల్గొన్న ఎమ్మెల్యే

బిచ్కుంద మున్నూరు కాపు సంఘంలో సన్మాన సభలో పాల్గొన్న ఎమ్మెల్యే

by Telangana Express

బిచ్కుంద ఫిబ్రవరి 21:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్)

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘంలో సన్మాన సభలో పాల్గొన్న జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీ కాంతారావు
సంఘం సభ్యులు ఎమ్మెల్యే ని పూలమాల వేసి శాలువతో సన్మానించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో మున్నూరు కాపుల ప్రాతినిద్యం అవసరమని మున్నూరు కాపులు ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలని ఆకాంక్షించారు.
మున్నూరు కాపులకు ప్రభుత్వం అండగా ఉంటుందని అదేవిధంగా ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించమని తెలిపారు..
వ్యవసాయ రంగం గురించి మాట్లాడుతూ జుక్కల్ నియోజకవర్గంలో సాగు నీటి ప్రాజెక్టుల ద్వారా కేవలం 13,000 ఎకరాలకు మాత్రమే సాగు నీరు అందుతున్నదని తెలిపారు..
లెండి, నాగమడుగు కౌలాస్ నాలా సాగునీటి ప్రాజెక్టులు గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురయ్యాయి అని ఆవేదన వ్యక్తం చేశారు.
కౌలాస్ నాలా లో ఇంజనీర్ గా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మూడు సార్లు ఎమ్మెల్యే గా పనిచేసే అవకాశం వచ్చినా కౌలాస్ నాలా ను పట్టించుకోకుండా గాలికి వదిలేసాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసి నియోజకవర్గ వ్యాప్తంగా 1,20,000 ఎకరాలకు సాగు నీరు అందించడమే తన లక్ష్యమని తెలిపారు.
అదేవిధంగా బిచ్కుంద మండల కేంద్రంలో రోడ్డు మరియు సెంటర్ లైటింగ్ పనులు త్వరలోనే పూర్తి చేస్తామన్నారు.
అతి త్వరలో బిచ్కుంద మున్సిపాలిటీగా మారబోతుందని తెలియజేశారు.
బిచ్కుంద మండల కేంద్రంలో వంద పడకల ఆసుపత్రి ప్రారంభించినప్పటికీ వైద్య సేవలు అందించడానికి ఒక్క డాక్టర్ కూడా లేడని ఈ సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించిగా సంబంధిత శాఖ మంత్రివర్యులు సానుకూలంగా స్పందించారని అన్నారు.
ఈవిధంగా ఒక్కొక్కటిగా ప్రధానమైన పనులు చేసుకుంటూ,సమస్యలు పరిష్కరించుకుంటూ జుక్కల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని దానికి మీరందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు జడ్పిటిసి భారతి రాజు, బిచ్కుంద మండల మున్నూరు కాపు సంఘ అధ్యక్షుడు అరవింద్ సార్ పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గంగాధర్, నిజాంసాగర్ మాజీ జెడ్పిటిసి ప్రదీప్, నూకల రాజు, బస్వంత్ వెంకటరమణ, మమదాబాద్ మాజీ సర్పంచ్ సాయిలు పత్లాపూర్ మాజీ సర్పంచ్ అరుణ్ కుమార్ అశోక్ బసవరాజ్ బిచ్కుంద గ్రామం మున్నూరుకాపు యువ నాయకులు ప్రజలు పాల్గొన్నారు

You may also like

Leave a Comment