మంచిర్యాల, ఫిబ్రవరి 21, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): మంచిర్యాల జిల్లా, జన్నారం మండలం, ఇంధన్ పల్లి గ్రామంలో సర్వే నెంబర్ 82/ఆ/1 లోని 1.30 ఎకరాల భూమిలో విద్యుత్ అధికారులు లసెట్టి గంగవ్వ అనుమతి తీసుకోకుండా, స్వాంత పొలంలో కరెంటు స్తంభాలను వేశారని ఆరోపించారు. బుధవారం జన్నారం మండల ప్రెస్ క్లబ్ లో విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందన్ పళ్లి గ్రామ శివారు గంగవ్వ స్వాంత పంట పొలంలో కరెంటు స్తంభాలు తీసివేయాలని, జన్నారం సబ్ స్టేషన్ ఏఈ కి విన్నవించిన పట్టించుకోవడం జరుగుతలేదన్నారు. కరెంటు స్తంభాలు వల్ల గంగవ్వ భూమి సాగు చేసే వేళలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తపరిచారు. జన్నారం విద్యుత్ అధికారులు స్పందించి కరెంటు స్తంభాలను సాగు భూమి మధ్యలో నుండి కాకుండా, సాగు భూమి గేట్టు పక్కనుండి వేయాలని గంగవ్వ కోరారు.
అక్కుదారు అనుమతి సొంత పొలంలో పాతిన కరెంట్ స్తంభాలు తీసివేయాలి
77
previous post