Home తాజా వార్తలు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మ బలిదానం చేసుకున్న పద్మశాలీల యాదయ్య 14 వ వర్ధంతి

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మ బలిదానం చేసుకున్న పద్మశాలీల యాదయ్య 14 వ వర్ధంతి

by Telangana Express

భక్తి మార్కండేయ పద్మశాలి చంద సేవా సంస్థ

మంచిర్యాల, ఫిబ్రవరి 20, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబి చౌరస్తాలో తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం ఆత్మ బలిదానం చేసుకున్న పద్మశాలీల సర్దార్ సిరిపురం యాదయ్య 14వ వర్ధంతిని, భక్తి మార్కండేయ పద్మశాలి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినారు. మంగళవారం మంచిర్యాల జిల్లా పట్టణంలోని భక్తి మార్కండేయ సేవా సంస్థ సమక్షంలో సిరిపురం యాదయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో తెలంగాణ తొలి దశ మలిదశ ఉద్యమంలో పద్మశాలీల పాత్ర మరువలేనిదని, మూడు తరాల ఉద్యమ నాయకుడు, తెలంగాణ జాతిపిత ఉమ్మడి ఆదిలాబాద్ ముద్దుబిడ్డ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ, టైగర్ ఆలే నరేంద్ర, సిరిపురం యాదయ్య లాంటి ఎందరో దేశం కోసం స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణాలు ఇచ్చిన చరిత్ర పద్మశాలీలదని, చేనేత కార్మికులదని కొనియాడారు. చేనేత కార్మికులను పద్మశాలీలను విస్మరించిన ఏ ప్రభుత్వాలకు కూడా మనుగడ ఉండదని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను జనాభా దమాశ ప్రకారము అన్ని రంగాలలో అవకాశాలు కల్పించాలని రాష్ట్ర మంత్రివర్గంలో కూడా పద్మశాలీలకు స్థానం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, తెలంగాణ ఉద్యమకారులకు ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరులకు జోహార్లు, సిరిపురం యాదయ్య అమర్ హై, సిరిపురం యాదయ్యకు జోహార్లుని పెద్ద పెట్టున నినాదాలు చేసినారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక, భక్త మార్కండేయ పద్మశాలి స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, నాయకులు శ్రీనివాస్ ఎస్ రాములు, సిహెచ్ చంద్రమౌళి, ఆర్, రాజేశం, ఆర్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment