Home తాజా వార్తలు మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ రేసులో గాలి దుర్గారావు

మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ రేసులో గాలి దుర్గారావు

by Telangana Express

-బీసీలకు కలిసి వచ్చిన రిజర్వేషన్
-మరల మధిర మార్కెట్ చైర్మన్ పదవి బోనకల్ మండలానికి దక్కే అవకాశం..?
-గ్రామస్థాయి నాయకులతో మంచి సంబంధాలు ఉన్న నాయకుడు గాలి దుర్గారావు
-ఎంపీ ఎన్నికల తర్వాతనే మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి భర్తి చేయనున్నట్లు సమాచారం.

బోనకల్, ఫిబ్రవరి 21 (తెలంగాణ ఎక్స్ప్రెస్) : మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి బోనకల్ మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గాలి దుర్గారావు రేస్ లో ఉన్నట్లు సమాచారం.? రాష్ట్రంలో మార్కెట్ కమిటీలకు నూతన పాలకవర్గాలను ఏర్పాటు చేయటం జరుగుతుందని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు ప్రకటించడంతో పాటు బిఆర్ఎస్ ప్రభుత్వంలో నియమించిన మధిర మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మార్కెట్ కమిటీలకు రిజర్వేషన్ ఏర్పాటు చేసి మధిర మార్కెట్ కమిటీ బిసి సామాజిక వర్గానికి కేటాయించింది. అయితే మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో బోనకల్ మండల అధ్యక్షులుగా కొనసాగుతున్న గాలి దుర్గారావు కి మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ దక్కనుందనీ విశ్వసనీయ సమాచారం..?నియోజకవర్గంలో 3 మండలాలకు గాను బోనకల్, ఎర్రుపాలెం, మధిర మండలాల పరిధిలో మధిర మార్కెట్ కమిటీ ఉంది. అదేవిధంగా నియోజకవర్గంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి అతిపెద్ద నామినేటెడ్ పదవి. మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని గత బిఆర్ఎస్ ప్రభుత్వం బోనకల్ మండలానికి బీసీ సామాజిక వర్గానికి చెందిన మండల పరిధిలోని ముష్టికుంట్ల గ్రామానికి చెందిన బంధం శ్రీనివాసరావుకు కేటాయించింది. అనివార్య కారణాలవల్ల ఆరు నెలల్లోని ఆ పదవి నీ కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. మరల బోనకల్ మండలానీకి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కేటాయించాలని నాయకులు కోరుతున్నారు. అయితే ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ రేసులో బోనకల్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా కొనసాగుతున్న గాలి దుర్గారావు దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం..? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటినుండి మధిర మార్కెట్ కమిటీ బోనకల్ మండలానికి ఇంతవరకు కేటాయించలేదు. కావున మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి బోనకల్ మండలానికి కేటాయించాలని కోరుతున్నారు. బిఆర్ఎస్ పాలనలో మార్కెట్ కి రెండు పాలకవర్గాలు పూర్తయి, మూడవ పాలకవర్గం కొనసాగుతూ రద్దు అయినది.గతంలో తీసిన రిజర్వేషన్ల ప్రకారం నాల్గోసారి కూడా బీసీ సామాజిక వర్గానికి మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ రిజర్వు చేయబడింది. కాంగ్రెస్ ప్రభుత్వం మార్కెట్ కమిటీల రిజర్వేషన్లు ఎత్తివేయకుండా యధావిధిగా చేసినందుకు సిద్ధమైంది. దీనిలో భాగంగానే మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బీసీ సామాజిక వర్గానికి కేటాయించారు. దీని ప్రకారం ప్రస్తుతం బోనకల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఉన్న గాలి దుర్గారావు కి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి వరించబోతుందని సమాచారం.? గాలి దుర్గారావు మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా మండలంలో కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచి పార్టీ క్యాడర్ను కాపాడారు. బిఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ కార్యకర్తలను అనేక ఇబ్బందులు పెట్టినా, వారికి మనోధైర్యాన్ని కల్పించి అండగా నిలిచారు. గాలి దుర్గారావు కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా, అధికారం ఉన్నా, లేకపోయినా పార్టీ కోసమే పని చేసి మల్లు భట్టి విక్రమార్క వెంట నడిచారు. భట్టి విక్రమార్క నాలుగు సార్లు గెలుపులో గాలి దుర్గారావు చురుకైన పాత్ర పోషించారు. అంతేకాకుండా ప్రతి గ్రామంలో గ్రామస్థాయి నాయకులతో మంచి సంబంధాలు కలిగి ఉన్న నాయకుడు గాలి దుర్గారావు అని చెప్పుకోవచ్చు. వ్యవసాయ కుటుంబానికి చెందిన గాలి దుర్గారావు కుటుంబం ఎన్ని ఒడిదుడుకులు వచ్చిన కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉన్నారు. మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి గాలి దుర్గారావు ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఎంపిక చేస్తారని మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోరుగా వినిపిస్తుంది. పార్లమెంటు ఎన్నికల తర్వాత మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ పదవని భర్తీ చేయనున్నట్లు సమాచారం..? అయితే ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎవరికి దక్కనుందో వేచి చూడవలసి ఉన్నది.

You may also like

Leave a Comment