Home తాజా వార్తలు కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి

కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి

by Telangana Express

మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్

ముధోల్:20ఫిబ్రవరి(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే బి. నారాయణరావు పటేల్ అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన ముధోల్ లో రూ.31లక్షల ఉపాధి హామీ నిధులతో కొత్త బస్టాండ్ సీసీ రోడ్డు నిర్మాణానికి ఎంపీపీ అయేషా అఫ్రోజ్ ఖాన్ భూమి పూజ చేశారు. అదే విధంగా బస్టాండ్ సమీపంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించా రు. అనంతరం ఏర్పాటు చేసిన సమా వేశంలో మాజీ ఎమ్మెల్యే నారాయణ రావు పటేల్ మాట్లాడుతూ ముధోల్ బస్టాండ్ రోడ్డు ప్రధాన రహదారి కావడంతో ప్రయాణికుల సౌకర్యార్థం కోసం రోడ్డు నిర్మాణ పనులను చేపట్టడం జరిగిందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు సరళ శ్రీనివాస్ గౌడ్,దేవోజి భూమేష్ ,మాజీ ఏఎంసీ చైర్మన్ ఆనందరావు పటేల్, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శంకర్ చంద్రే, ముధోల్ మండలం ఇంచార్జ్ రావుల గంగారెడ్డి, విడి సి అధ్యక్షులు నారాయణ,కాంగ్రెస్ నాయకులు ప్రేమ్ నాథ్ రెడ్డి, కిషన్ పటేల్, కిషన్ పా తంగే,గోవింద్ పటేల్ అజిజ్,వాహ జ్,ముత్యం రెడ్డి, నాగేష్,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment