తెలంగాణ ఎక్స్ ప్రెస్ 20/02/24
భైంసా మండలం కేంద్రం లో నీ
భైంసా పట్టణం లోని మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ పథకం ప్రజా వేదిక లో హాజరైన జిల్లా పిడి విజయ లక్ష్మి,మండల పరిషత్ అధ్యక్షులు రజాక్ ఆధ్వర్యంలో సామాజిక తనిఖీ లో భాగంగా ఉపాధి పనిలో ఆడిట్ నిర్వహించారు.
ప్రజా వేదికలో పలు సమస్యలపై మాట్లాడుతూ ముఖ్యంగా మైనర్ బాలిక పేరిట జాబ్ కార్డ్ ఇవ్వడం, ఊళ్ళో లేక పోయినా,పని చేయక పోయిన రిజిష్టర్ లో పేర్లు నమోదు చేసుకోవడం,వికలాంగులకు పని కల్పించకపోవడం, కూలి డబ్బులు తక్కువగా ఇవ్వడం,తదితర అంశాలపై నిలదీయడం జరిగింది.అదేవిధంగా ఉపాధి హామీ పనిలో కూలీలకు గడ్డ పార, తట్ట,పని ముట్లు,గత కొన్ని సంవత్సరాలుగా ఇవ్వడం లేదు.అసలే ఎండ కాలం పని చోట్ల టెంట్,మంచి నీళ్ళ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వికలాంగుల సంఘం జిల్లా నాయకులు రాజు, పరమేశ్ తదితరులు పాల్గొన్నారు.