మంచిర్యాల, ఫిబ్రవరి 20, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ 20వ వార్షికోత్సవం 2023-24 సందర్భంగా హైదరాబాదులోని రవీంద్ర భారతి అరిటోరియంలో నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన శ్రీనివాస రామానుజన్ ఎక్సలెన్స్ బహుమతి లలో భాగంగా మంచిర్యాల జిల్లా జన్నారం మండలం స్లేట్ స్కూల్స్ ప్రిన్సిపల్ ఏనుగు శ్రీకాంత్ రెడ్డి బెస్ట్ ప్రిన్సిపాల్ బహుమతికి ఎన్నికయ్యారు. ఈ రాష్ట్ర స్థాయి బెస్ట్ బహుమతిని లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ చేతుల మీదుగా బెస్ట్ ప్రిన్సిపల్ బహుమతి స్లేట్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీకాంత్ రెడ్డి అందుకున్నారు. సుమారు గత 20 సంవత్సరాల నుండి అద్భుతమైన నాయకత్వ చతురత, విద్యారంగంలో అనేక మంది విద్యార్థిని విద్యార్థులను రాష్ట్రస్థాయిలో ఉత్తమంగా తీర్చిదిద్ది రాష్ట్రస్థాయిలో పాల్గొనే విధంగా చేసి, విద్యతో పాటు విలువలు, ఆటలు నేర్పుతున్న స్లేట్ హై స్కూల్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ ఏనుగు శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు. బెస్ట్ ప్రిన్సిపల్ అవార్డు తీసుకున్న శ్రీకాంత్ రెడ్డి ను, స్లేట్ హైస్కూల్ ఫౌండర్ ఏనుగు సుభాష్ రెడ్డి, అడ్మినిస్ట్రేటర్ ఏనుగు రజిత రెడ్డి, వివిధ పాఠశాలల కరస్పాండెంట్స్, సిబ్బంది, మిత్రులు, తదితరులు అభినందించారు.
బెస్ట్ ప్రిన్సిపల్ బహుమతి అందుకున్న స్లేట్ హై స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీకాంత్ రెడ్డి
56
previous post