Home తాజా వార్తలు ఆగని అక్రమ నిర్మాణాలు

ఆగని అక్రమ నిర్మాణాలు

by Telangana Express

పట్టించుకోని టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు
అనుమతులు లేకుండా అదనపు అంతస్థులు
ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్‌ నిద్రమత్తులో అధికారులు

మల్కాజ్గిరి జిల్లా (తెలంగాణ ఎక్స్ప్రెస్ రిపోర్టర్) : అల్వాల్ జిహెచ్ఎంసి సర్కిల్‌ పరిధి లోని లోని 133 డివిజన్‌ లలో అక్ర మ కట్టడాలు యథేచ్ఛగా జరుగుతున్నా టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. రోడ్లను కబ్జా చేసి సెట్‌ బ్యాక్‌ లేకుండా ఇంటి నిర్మాణాలు చేపడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. జి ప్లస్‌ 3 అనుమతి లేకుండానే సెల్లులార్ తో అయిదు బహుళ అంతస్థుల నిర్మాణాలు చేపడుతూ ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నా అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడంటం లేదు. ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమ కట్టడాలను నిర్మిస్తే చర్యలు తీసుకోవాలని సూచించినా అధికారులు మాత్రం నిద్రమత్తు వదలడం లేదు. అల్వాల్ సర్కిల్‌ పరిధిలో అక్రమ కట్టడాలపై అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. సర్కిల్‌ పరిధిలో అధికారులు క్షేత్రస్థాయిలో తిరిగి అక్రమ కట్టడాలను గుర్తించాల్సింది పోయి. కార్యాలయాల కుర్చీలకే పరిమితం అవుతున్నారు. కిందిస్థాయి ఉద్యోగులు అక్రమంగా నిర్మిస్తున్న గృహ యాజమానుల కు నోటీసులు ఇవ్వడంతో సరిపోతుంది అక్రమ కట్టడాల గురించి సమాచారం ఇవ్వడం లేదని తెలుస్తోంది. కాలనీ వాసులు అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిపై ఫిర్యాదు చేసినా నామమాత్రపు నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. 133 డివిజన్‌ మరియు సెంట్ మైకిల్ స్కూల్ నుండి ఐస్ ఫ్యాక్టరీ వెళ్లే దారిలో శ్రీ సాయి బృందావన్ కాలనీ బస్ స్టాప్ ప్రక్కన సర్వే నంబర్ 24 అక్రమ సెల్లర్‌ తో పాటు అక్రమ అంతస్థుల నిర్మాణం చేపడుతున్న అధికారులు వెళ్లి అడుగుతే రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులతో ఫోన్ చేయించి భయ ప్రాంతాలకు గురిచేస్తున్నారు గతంలో ఒక జర్నలిస్ట్ రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులతో ఫోన్ చేయించి మీరు ఇక్కడికి రానే రావద్దు అని అన్నారు.కానీ ఇలా పదుల సంఖ్యలో అక్రమ కట్టడాలు అధికారుల దృష్టికి వెళ్లిన కూడా ఆ అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలం అయ్యారు. అల్వాల్ సర్కిల్‌ అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకుంటారో లేదా అందరి అధికారుల లాగా చర్యలు తీసుకోకుండా గాలికి వదిలేస్తారో చూడాలి. కాసులకు కక్కుర్తి పడి అధికారులు అక్రమ నిర్మాణాలను చూసీ చూడనట్లు వ్యవహరి స్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు కార్యాలయాల నుంచి బయటకు వచ్చి అక్రమ నిర్మణాలపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. జెడ్‌ సి, డీసీ స్పందించి అక్రమ నిర్మాణాలపై కొరఢా చూపించాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు.

You may also like

Leave a Comment