నిబంధనల మేరకే తీశామన్న కాంట్రాక్టర్…
వీణవంక, ఫిబ్రవరి 20( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి).
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఘన్ముక్ల గ్రామం పక్కనగల కుంట నుండి మట్టిని తరలించవద్దంటూ రైతులు ఆందోళన చేపట్టారు. రైతులు మాట్లాడుతూ… కరీంనగర్ – జమ్మికుంట మార్గాలను కలిపే ప్రధాన రహదారి నర్సింగాపూర్- వీణవంక గ్రామాల మధ్య జరుగుతున్న రోడ్డు పనులకు అవసరమైన మట్టిని, కుంట నుండి పరిమితిని మించి తీయడం ద్వారా భూగర్భ జలాలు తగ్గిపోయి, బావుల్లో నీరు లేకుండా పోతుందని, అదే కాక కుంట కింద ఉన్న పొలాలు కుంట లోతు ఉండడంవల్ల, పంట పొలాలు ఎండగా, వరి కోసే సమయంలో కూడా ట్రాక్ మిషన్లతో కోయడం జరుగుతుందని, ట్రాక్ మిషన్ సైతం దిగబడడంతో వాటిని బయటకు తీయడానికే నా నా తంటాలు పడుతున్నామని, దయచేసి అధికారులు మట్టి తీయడం ఆపివేయాలని ఆవేదన వ్యక్తం చేశారు.ఇదే విషయంపై రోడ్ కాంట్రాక్టర్ ను వివరణ కోరగా.. ఇరిగేషన్ అధికారుల సూచన మేరకే మట్టిని తీయడం జరుగుతుందని వారు తెలపడం జరిగింది. ఈ ఆందోళన కార్యక్రమంలో రైతులు సమ్మిరెడ్డి, మల్లారెడ్డి, కొమురయ్య, ఇతర రైతులు పాల్గొన్నారు.