నియోజకవర్గంలోని ‘ ‘ఆదరణ’ ఫౌండేషన్ కి ‘ నిత్యవసరాలు’ వితరణ
బోనకల్ , ఫిబ్రవరి 21 ( తెలంగాణ ఎక్స్ప్రెస్ ): భాగం సేవా ఫౌండేషన్ తమ సేవా కార్యక్రమాలను నిర్విరామంగా కొనసాగిస్తుంది. ఫౌండేషన్ నిర్వాహకులు ,ఎన్ ఆర్ ఐ భాగం రాకేష్ తమ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తూ సేవా నిరతిని చాటుకుంటున్నారు. మండలంలోని గోవిందాపురం (ఏ) గ్రామానికి చెందిన యువకులు భాగం రాకేష్ భాగం సేవా ఫౌండేషన్ ద్వారా పలు సేవలు చేస్తున్నారు.దీనిలో భాగంగా నియోజకవర్గ కేంద్రమైన మధిర లో సుశీల డిగ్రీ కాలేజ్ రోడ్ లో గల “ఆదరణ” ఫౌండేషన్ వారి అవసరాలను గమనించి బియ్యం, నిత్యవసర సరుకులను వితరణగా ఇచ్చారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు భాగం రాధాకృష్ణ మాట్లాడుతూ నేటి యువత సేవా దృక్పథాన్ని అలవరచు కోవాలని, తద్వారా పలువురికి ఆదర్శంగా మారతారని తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అనంతరం ఆదరణ ఫౌండేషన్ నిర్వాహకురాలు నిస్సి హరిణి మాట్లాడుతూ భాగం ఫౌండేషన్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారు కొనసాగిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కావూరి వెంకటరావు, భాగం పాపారావు, గుండపనేని రాజేంద్ర బాబు, ఎస్ కే రంజాన్ వలి తదితరులు పాల్గొన్నారు.