Home తాజా వార్తలు హిందూ వాహిని ఆధ్వర్యంలో ఘనంగా శివాజీ మహారాజు జయంతి వేడుకలు

హిందూ వాహిని ఆధ్వర్యంలో ఘనంగా శివాజీ మహారాజు జయంతి వేడుకలు

by Telangana Express

మండలంలో భారీ ర్యాలీ నిర్వహించిన హిందూ వాహిని నాయకులు

మంచిర్యాల, ఫిబ్రవరి 19, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): హిందూ వాహిని ఆధ్వర్యంలో సోమవారం మంచిర్యాల జిల్లా, జన్నారం మండల నాయకులు 394 చత్రపతి శివాజీ జయంతి మహారాజ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జన్నారం పట్టణ గ్రామాలలో హిందూ వాహిని నాయకులు చత్రపతి శివాజీ స్టిక్కర్లను పట్టుకొని భారీ ర్యాలీ చేశారు. సోమవారం జన్నారం మండలంలోని కవ్వాల్ గ్రామా స్టాచ్ర్ వద్ద నుండి శివాజీ ఫోటోలను చేత పట్టుకొని బైక్ పై కామనుపల్లి, దేవుని గూడా, గూండా రేండ్లగూడ గ్రామంలో చత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలను ఘనంగా జరిపారు. అనంతరం జన్నారం పట్టణ కేంద్రం గుండా బస్ స్టేషన్ మూలమలుపు నుంచి పొనకల్ గ్రామం మీదుగా డిజే సౌండ్లతో బైకులపై ఊరేగింపుగా చింతలపల్లి గ్రామం చేరుకొని, చత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటానికి పాలాభిషేకం హిందూ వాహిని నాయకులు చేశారు. హైందవ జాతి రక్షణే ధ్యేయంగా, ధర్మ రక్షణే ధ్యానంగా తపించిన మరాఠీ ధర్మవీరుడు. హిందుత్వమే ప్రాణంగా, స్వాభిమానమే ఆయుధంగా జాతి పౌరుషాన్ని చాటిన శత్రు భయంకరుడు, హిందూ హృదయ సామ్రాట్
ఛత్రపతి శివాజీ మహారాజ్ అని జయంతిని గర్వంగా హిందు వాహిని నాయకులు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని జిల్లా పట్టణ నాయకులు చత్రపతి శివాజీ మహారాజ్ నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment