Home తాజా వార్తలు కుల ,సంఘ బహిష్కరణ మాటే మా మతంలో లేదు.?

కుల ,సంఘ బహిష్కరణ మాటే మా మతంలో లేదు.?

by Telangana Express

ముస్లీం సంఘ ప్రతినిధుల వాదన
ఆరోపణలన్నీ అవాస్తవం

బీబీపేట్ ఫిబ్రవరి 19 ( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ) పూర్వీకుల నుండి అనాదిగా ఉన్న తన స్వంత ఖాళీ స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నంలో వ్యతిరేకించిన కారణంగా కుల ,సంఘం నుండి భహిష్కరించారని ఇటీవల బీబీపేట్ మండల కేంద్రానికి చెందిన సయ్యద్ తాలే అలీ శాఖాద్రీ ( ఖాలెద్ ) ఆరోపించిన ఆరోపణల్లో వాస్తవం లేదని ,అన్నీ అవస్థావలేనని ముస్లిం సంఘ ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు .విషయానికొస్తే తమ మతంలో బహిష్కరణ పదమే ఉచ్చరించమని తెలుపుతూ ఇటీవల పాత్రికేయులసమావేశంలో తనకు ప్రాణ భయం ఉందని ,తన స్వంత స్థలం ఆక్రమించే ప్రయత్నంలో కొంత మంది మానసికంగా ఇబ్బందపెడుతున్నారని ,చెబుతూ పోలీసు ఉన్నతాధికారులకు ఖలేద్ ఫిర్యాదు చేసిన విషయాన్ని వివరించారు .అయితే పై ఆరోపణలన్నీ అవాస్తవమని సోమవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో తీవ్రంగా ఖండించారు .ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు ఆసీఫ్ ,ఫాక్రోద్దీన్ ,అఫ్జల్ ,సలీం మాట్లాడుతూ స్థానిక జామా మజీద్ ప్రక్కన గల కబురస్థాన్ ( స్మశానవాటిక ) స్థలంలో దర్గా ఉందని ,సమీప స్థలం సుమారు 72 సంవత్సరాల క్రితం నుండి మాజీదుకు సంక్రమంగా ఉందని వివరిస్తూ అట్టి స్థలంలో సదరు ఫిర్యాదు దారు కాలెద్ అక్రమంగా మరమ్మతులు చేయించే ప్రయత్నం చేశారని ప్రయత్నాన్ని నివారించే ప్రయత్నం తమ సంఘ సభ్యులు చేస్తూ అభ్యంతరం తెలుపగా ఇట్టి వివాదం తెరపైకి వచ్చిందని పలువురు సభ్యులు వివరించారు .ఈ విషయం జీర్ణించుకోలేని కాలేదు తమ సంఘ సభ్యులపై పొలీస్ స్టేషన్లో ,జిల్లా కలెక్టర్ లకు తప్పుడు ఫిర్యాదు చేశారని ,అయినప్పటికీ తమ సంఘ సభ్యుడైన ఖాలేదు పై ఎలాంటి ఆక్రోశం ,ఆవేశం పెంచుకోలేదని వివరిస్తూ సంఘ ప్రతినిధులపై తప్పుడు ఆరోపణలు ,ఫిర్యాదులు చేసినా ఓపికతో ఉపేక్షించామని తెలిపారు .ఏది ఏమైనా చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి మార్గమని భావించిన తమకు కాలేదు సహకరించక పోగా తమ సంఘ సభ్యుల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆవేశం వ్యక్తం చేశారు .ఇప్పటికైనా సమస్య పరిష్కారానికి సహకరించాలని ,లేనిచో గతంలో చేసిన ఆరోపణలు ,ఫిర్యాదులు అవాస్తవమని ప్రజలు గమనించాలని కోరారు .కేవలం ప్రజలను తప్పుతోవ పట్టిస్తూ సానుభూతి పొందడనికే కాలేదు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వివరించారు .ఈ సమావేశంలో సంఘ ప్రతినిధులతో పాటు సంఘ సభ్యులు పాల్గొన్నారు .

You may also like

Leave a Comment