బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్
మిర్యాలగూడ ఫిబ్రవరి 19: తెలంగాణ రాష్ట్రంలో బిసి, ఎస్సీ, ఎస్టి హాస్టల్ విద్యార్థుల మేస్ చార్జీలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మిర్యాలగూడలో బీసీ యువజన సంఘం సమావేశంలో బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులు పెట్టింది హాస్టల్ విద్యార్థులకు మేస్ చార్జీలు పెంచుతా అని చెప్పి హామీ ఇచ్చి హామీ నిలబెట్టుకోలేని పరిస్థితి గత కొంతకాలంగా హాస్టల్ విద్యార్థులకు మేస్ చార్జీలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు చాలీచాలని భోజనంతో కడుపు నింపుకునే పరిస్థితి ఏర్పడ్డది నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వమైన పేద విద్యార్థుల పక్షాన ఆలోచన చేసి గత పెండింగ్ బకాయిలను విడుదల చేసి పెరిగిన ధరల ప్రకారం విద్యార్థులకు మిస్ చార్జీలు పెంచాలని ఆయన అన్నారు అంతేకాక స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ పై ఆధారపడి ఎంతో మంది పేద విద్యార్థులు విద్యని అభ్యసించే వాళ్ళు గత కొంతకాలంగా కళాశాల విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయకపోవడంతో చాలామంది పేద విద్యార్థులు చదువులకు దూరమైన పరిస్థితి ఏర్పడదని ఆయన అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్ ఫీజు బకాయిలను అలాగే హాస్టల్ విద్యార్థుల మేస్ చార్జీలను తక్షణమే విడుదల చేయాలని ఆయన కోరారు.. ఈ కార్యక్రమంలో పూల గాని వెంకటేష్ గౌడ్, ఆర్లపూడి శ్రీనివాస్, చిలకల మురళి యాదవ్, రాయించు నరసింహ, నరేష్, గంగాధర్, రాము గౌడ్ , శేఖర్ తదితరులు పాల్గొన్నారు.