మిర్యాలగూడ ఫిబ్రవరి 18 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) కోరారు. ఆదివారం మిర్యాలగూడ పట్టణంలోని
నందిపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కప్పల మట్టమ్మ జ్ఞాపకార్థం స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారిచే కప్పల సనత్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా మెడికల్ క్యాంపు ను ఎమ్మెల్యే బిఎల్ఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆరోగ్య సేవల కోసం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించేందుకు ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాయం ఉపేందర్ రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిలె. శ్రీనివాస్, కౌన్సిలర్ కొమ్ము శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ తుడి అశోక్ రెడ్డి, నాగిరెడ్డి, మాజీ సర్పంచ్లు
నాగు నాయక్,జొన్నలగడ్డ శ్రీనివాస్ రెడ్డి,నాగిరెడ్డి వెంకటరెడ్డి,
దుర్గాప్రసాద్,చెరుకూరి కోటేశ్వరావు, చలమళ్ల రామకృష్ణ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు షేక్ ఇమ్రాన్, కాంగ్రెస్ నాయకులు, బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు.

