Home తాజా వార్తలు సినీ, మూవీ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రాథోడ్ ను సన్మానించిన జడ్పీ చైర్మన్

సినీ, మూవీ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రాథోడ్ ను సన్మానించిన జడ్పీ చైర్మన్

by Telangana Express

బోనకల్, ఫిబ్రవరి 17 (తెలంగాణ ఎక్స్ప్రెస్) :బోనకల్ మండల కేంద్రానికి చెందిన గిరిజన బిడ్డ బానోత్ శ్రీనివాస్ రాథోడ్ తెలంగాణ మూవీ టీవీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్ గా ఘన విజయం సాధించడంతో ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు శనివారం రాథోడ్ కు శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి సన్మానించారు.
ఈ సందర్భంగా కమల్ రాజు మాట్లాడుతూ… బోనకల్లు ప్రాంతానికి చెందిన శ్రీనివాస రాథోడ్, హైదరాబాద్ సినీ ఇండస్ట్రీలో గత కొన్ని సంవత్సరాలుగా ఆర్టిస్టుగా ఉంటూ అక్కడ ఉన్నటువంటి మూవీ, టీవీ ఎన్నికల్లో గత మూడుసార్లుగా పోటీ చేసి గెలుస్తూ ఓటమి ఎరుగని లీడర్ లా సినీ ఇండస్ట్రీలో ఉండటం చాలా ఆనందాన్ని కలిగించిందన్నారు. బోనకల్ ప్రాంతంలో టాలెంట్ ఉన్న యువకులకు రాథోడ్ తోడ్పాటు అందించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో.. బిఆర్ఎస్ పార్టీ బోనకల్ మండల అధ్యక్షుడు మల్లికార్జునరావు, కార్యదర్శి మోదుగుల నాగేశ్వరరావు, మాజీ జెడ్పిటిసి బానోతు కొండ, మధిర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బంధం శ్రీనివాసరావు, మాజీ రైతు కన్వీనర్ వేమూరి ప్రసాదు, ఆ పార్టీ నాయకులు పార ప్రసాద్ , బంధం నాగేశ్వరరావు, నాగరాజు, తన్నీరు పుల్లయ్య, షేక్ బాబు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment