Home తాజా వార్తలు ఘనంగా వెల్జాల్ గ్రామంలో కెసిఆర్ జన్మదిన వేడుకలు

ఘనంగా వెల్జాల్ గ్రామంలో కెసిఆర్ జన్మదిన వేడుకలు

by Telangana Express
  • తలకొండపల్లి మాజీ ఎంపీపీ సిఎల్. శ్రీనివాస్ యాదవ్

తలకొండపల్లి, ఫిబ్రవరి 17
(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీపీ. సిఎల్. శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో స్వరాష్ట్రాన్ని సాధించిన కారణజన్ముడు, సాధించిన రాష్ట్రాన్ని 10 ఏండ్లలోనే దేశానికి ఆదర్శంగా నిలిపిన దార్శనికుడు, బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు వెల్జాల్ గ్రామపంచాయతీ ప్రాంగణంలో కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కారణ జన్ముడు కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావ్ 70వ జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆరోగ్యంతో నిండునూరేళ్ళు జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా పరిషత్ కో ఆప్షన్ మూజీబూర్ రహేమాన్, రైతు సంఘం అధ్యక్షుడు. నరేందర్ గౌడ్, గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్ నాయకులు యాదయ్య, విజయ్ కుమార్, శ్రీరామ్, శ్రీను, జంగయ్య,రమేష్ యాదవ్, మోహన్ లాల్, సుధాకర్, గోవర్ధన్ గౌడ్, శ్రీశైలం యాదవ్, వెంకటయ్య, గోద ఆంజనేయులు, అవినాష్ గౌడ్, శ్రీశైలం, విజయ్ యాదవ్, రాజు, జగన్, లింగం, రవి. వినోద్, కృష్ణయ్య, సాయి, కుమార్ తదితరులు పాల్గొన్నారు..

You may also like

Leave a Comment