Home తాజా వార్తలు ఎల్లారెడ్డి లో ఘనంగా మాజీ సిఎం కేసీఆర్ 70 వ జన్మదిన వేడుకలు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ

ఎల్లారెడ్డి లో ఘనంగా మాజీ సిఎం కేసీఆర్ 70 వ జన్మదిన వేడుకలు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ

by Telangana Express

ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 17,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

ఎల్లారెడ్డి పట్టణంలోని తెలంగాణ తల్లి ప్రాంగణంలో, శనివారం బి అర్ ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర మాజీ సిఎం కేసీఆర్ 70 వ జన్మదిన వేడుకలను పట్టణ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు ఎరుకల సాయిలు, బిఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఆదిమూలం సతీష్ కుమార్ , నాయకులతో కలిసి చైర్మన్ కేక్ కట్ చేసి ఒకరి కోకరు తినిపించు కున్నారు. మాజీ సిఎం కేసీఆర్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఆయురా రోగ్యాలతో ఉండాలని, భగవంతుడు మరింత శక్తిని ప్రసాదించాలని , రానున్న కాలంలో కేసీఆర్ నాయకత్వం లో మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో స్టాప్ నర్స్ హారిక తో కలిసి రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ కుడుముల సత్యనారాయణ, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు ముజ్జు, కౌన్సిలర్ ఎరుకల సాయిలు, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఆధిమూలం సతీష్ కుమార్, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు శ్రావణ్ కుమార్ , ఇమ్రాన్ సాజిద్, బర్కత్, పాల్డే నారాయణ, నాగం రాజయ్య, అట్కరి బబ్లూ, అనిల్ నాయక్, హర్ష వర్ధన్, మాజీ సర్పంచ్ లు అబ్దుల్ అలీ మహ్మద్, రఘువీర్ గౌడ్ , తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment