Home తాజా వార్తలు ముస్తాబైన సమ్మక్క -సారలమ్మ గద్దెలు

ముస్తాబైన సమ్మక్క -సారలమ్మ గద్దెలు

by Telangana Express

ముధోల్:17ఫిబ్రవరి(తెలంగాణ ఎక్స్ ప్రెస్)

ముధోల్ మండలంలోని ఎడ్ బిడ్ తాం డ గ్రామంలో ప్రతి సంవత్సరం నిర్వ హించే సమ్మక్క -సారలమ్మ జాతరకు గద్దెలు ముస్తాబైనట్లు దేవదాయ స్థాప కులు రేణుకమ్మ తెలిపారు. ఈ జాతరకు నియోజకవర్గ కేంద్రమైన ముధోల్, బాసర,తానూర్, కుంటాల, లోకేశ్వరం,కుబీర్, బైంసా, నిజామాబాద్ హైదరాబాద్ పట్టణాల నుండి కాకుండా మహారాష్ట్ర లోని ముంబై,ధర్మబాద్ ప్రాంతాల నుండి భారీగా సంఖ్యలో భక్తులు సమ్మక్క- సారాలమ్మలను దర్శించుకుంటారు. సమ్మక్క-సరలమ్మ లు కోరిన కోరికలు తీర్చి అమ్మవారిని భక్తుల నమ్మకం.

ఈనెల 21వ తేదీ నుండి 24వ తేదీ వరకు సమ్మక్క -సారలమ్మ జాతర జరుగుతుందన్నారు.సమ్మక్క -సారలమ్మ గద్దెలను 21 తేదీన కనక వనం గద్దెపైకి వచ్చును, సరళమ్మ దేవత గద్దే పైకి వచ్చును. 22వ తేదీన శ్రీ సమ్మక్క గద్దె పైకి వచ్చును, 23వ తేదీన శుక్రవారం భక్తులు సమ్మక్క -సారలమ్మ దేవతలకు ఓడి బియ్యం నిలువెత్తు బంగారం , బోనాలు మేకలతో మొక్కులను సమర్పించబడును.చివరి రోజైన 24వ తేదీన శనివారం సమ్మక్క -సారలమ్మ తిరిగి వనప్రవేశంగా వెళతారు. దింతో ఈ జాతర నాలుగు రోజులపాటు ఎంతో వైభవంగా జరుగుతుందని నిర్వాహకురాలు తెలిపారు

You may also like

Leave a Comment