Home తాజా వార్తలు కౌలాస్ లో ఘనంగా రథోత్సవం అగ్నిగుండంలో నడిచిన భక్తులు

కౌలాస్ లో ఘనంగా రథోత్సవం అగ్నిగుండంలో నడిచిన భక్తులు

by Telangana Express

జుక్కల్ ఫిబ్రవరి 17 తెలంగాణ ఎక్స్ ప్రెస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలం కౌలాస్ లో వృషభలింగ శివాచార్య సంస్థాన్ మఠం లో వసంత పంచమి ,రథసప్తమి ఉత్సవాలు మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించారు. వృషభలింగ శివాచార్య మఠాధిపతి బసవలింగ శివాచార్య మహారాజు ఆధ్వర్యంలో మూడు రోజులపాటు కార్యక్రమాలు కనుల పండుగగా నిర్వహించారు. శనివారం తెల్లవారుజామున నిర్వహించిన రథోత్సవం, అగ్నిగుండం కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకర్షించాయి . మహాదేవ్ మందిర్ దగ్గర నిర్వహించిన అగ్నిగుండంలో భక్తులు కనకనమండే నిప్పురవ్వల పై నడిచి తమ భక్తిని చాటుకున్నారు. మఠం సంస్థానం నుండి మాధవ్ మందిర్ వరకు రథాన్ని లాగుతూ భక్తులు ఊరేగింపు నిర్వహించారు. భజనలు కీర్తనలు నృత్యాలతో కన్నడ మరాఠీ తెలుగు సాంప్రదాయ పాటలతో శివసత్తుల వేషధారణతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అగ్నిగుండం దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించి వందల సంఖ్యలో భక్తులు అగ్నిగుండంలో నడిచి భక్తిని చాటుకున్నారు కనుక మండే నిప్పురవ్వలపై నడిస్తే తమ పాపాలు తోలగుతాయని నమ్మకం భక్తుల్లో ఉంది. అందుకని భక్తులు పోటీపడి అగ్నిగుండంలో నడిచారు శనివారం రాత్రి మఠం లో నిర్వహించిన సమావేశంలో మఠాధిపతులు బసవలింగ శివాచార్య మహారాజ్, మల్లికార్జున స్వామి మహారాజ్, శంకర లింగ శివాచార్య మహారాజ్, లు ప్రవచనం చేస్తూ ధర్మరక్షణకు అందరూ సహకరిస్తేనే భారతదేశంలో సంప్రదాయాలు, ఆచారాలు ముందుకు కొనసాగుతాయని అన్నారు, భక్తులు దూరలవాట్లకు దూరంగా ఉంటూ మనుషుల్లో ప్రేమ భావాలు, మానవతా దృక్పథం పెంచుకుంటేనే ధర్మరక్షణ సాధ్యమవుతుందని ప్రవచనంలో పేర్కొన్నారు. రాత్రి కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ ప్రాంతాల భజన మండలి సాంప్రదాయ భజనలు చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గంగారం స్థానిక నాయకులు మండల వైస్ ఎంపీపీ ఉమాకాంత్ దేశాయి సర్పంచ్ హనుమాన్లు నాయకులు అనిత సింగ్, శంకర్ పటేల్, పటేల్ పండిత్ రావు, మల్లికార్జున్, బస్వరాజ్, హనుమ గౌడ్ ,బాబు,సంగప్ప,వీరేశ్ పటేల్,విఠల్ పటేల్, పాకాలి వెంకటేష్,గంగారెడ్డి,బోడ సాయిలు,మూడు రాష్ట్రాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

You may also like

Leave a Comment